ETV Bharat / bharat

పట్టాలపై కూలీల పాదయాత్ర.. అడ్డుకున్నందుకు రాళ్లదాడి! - వలస కూలీలు

కేరళలో వలస కూలీలు తమ స్వస్థలాలకు పంపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. రోజుకు ఒక పూట మాత్రమే భోజనం అందిస్తున్నారని.. రేషన్​ కూడా చాలా తక్కువగా ఇస్తున్నారని వాపోతున్నారు. నడక దారిన స్వస్థలాకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. మరికొందరు పోలీసులపై దాడికి తెగబడ్డారు.

Kerala
కేరళలో 'వలస' కష్టాలు
author img

By

Published : May 19, 2020, 11:52 PM IST

కేరళలో వలస కూలీల పరిస్థితి దయనీయంగా ఉంది. ఉపాధి కోల్పోయిన చాలా మందికి ప్రభుత్వం ఆశ్రయం కల్పించినా.. వసతులు, భోజనం సరిగా లేవని ఆరోపిస్తున్నారు. కన్నూరు జిల్లాలో సుమారు వంద మంది కూలీలు నడక దారిన వేల కిలోమీటర్లు ప్రయాణించేందుకు సిద్ధమయ్యారు.

వస్తువులతో పాటు నీళ్ల డబ్బాలను మోసుకుంటూ రైలు పట్టాల వెంబడి బిహార్​, ఉత్తర్​ప్రదేశ్​ రాష్ట్రాలకు.. మహా పాదయాత్ర ప్రారంభించారు. అయితే వీరిని రైల్వే రక్షణ దళం (ఆర్​పీఎఫ్​) సిబ్బంది అడ్డుకొని ప్రభుత్వ క్యాంపులకు తరలించారు. వారిని బిహార్​, ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన కూలీలుగా గుర్తించారు. కోజికోడ్​లోని కుట్టియాడిలో బిహార్​కు చెందిన కొంత మంది కూలీలు.. తమ రాష్ట్రాలకు పంపాలని పోలీసులపైకి రాళ్లు విసిరారు. దాడి చేసేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది.

"మేం మా ఇళ్లకు వెళ్లానుకుంటున్నాం. రోజుకు ఒకసారి భోజనం అందిస్తున్నారు. మా వద్ద డబ్బు లేదు. ఇక్కడ పని లేదు. ఇళ్లకు వెళ్లటం తప్ప మాకు మరో మార్గం లేదు."

- వలస కూలీలు

సీఎం స్పందన మరోలా..!

"ఉత్తర్​ప్రదేశ్​, బిహార్​కు చెందిన వలస కూలీలు కన్నూరు రైల్వే స్టేషన్​కు బయలుదేరారు. అక్కడికి చేరుకుని తమను చేరవేసేందుకు రైళ్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు వారికి నచ్చజెప్పి క్యాంపులకు తరలించారు. అంతేకాని వారి రాష్ట్రాలకు నడకదారిలో వెళ్లాలని ప్రయత్నించలేదు." అని కేరళ సీఎం పినరయి విజయన్ స్పష్టం చేశారు.

డిప్యూటీ ఎస్పీ స్థాయి అధికారి వలస కూలీల క్యాంపులను సందర్శించి.. అధికారులు చేసిన ఏర్పాట్లను సమీక్షించారు. వారిని రాష్ట్రాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తామని కార్మికులకు చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.