ETV Bharat / bharat

ఈ-పాలన విస్తరణతోనే క్షేత్రస్థాయికి ప్రభుత్వ సేవలు - Digital India

కరోనా దేశానికి ఎంతో నష్టం చేకూర్చినా.. కొన్ని ఉపయోగకరమైన పనులు ఊపందుకొనేలా చేసింది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్​ పాలన(ఈ-పాలన) విషయంలో ఇది పూర్తిగా వర్తిస్తుంది. అయితే డిజిటల్‌ పాలనలో సరిదిద్ధాల్సిన లోపాలు కొన్ని ఉన్నాయి. బడుగు వర్గాలను డిజిటల్‌ అక్షరాస్యులుగా మార్చి.. ఈ-పాలనను విస్తరిస్తేనే క్షేత్రస్థాయిలో పూర్తిగా ప్రభుత్వ సేవలు అందుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Ground level public service possible through E-Governance
ఈ-పాలన విస్తరణతోనే క్షేత్రస్థాయికి ప్రభుత్వ సేవలు
author img

By

Published : Jul 6, 2020, 10:01 AM IST

జనాన్ని నాలుగు గోడలకు పరిమితం చేసి వ్యక్తుల పనిపాటలతోపాటు ప్రభుత్వ పాలనను కూడా డిజిటల్‌ సీమకు తరలేట్లు చేస్తోంది కరోనా మహమ్మారి. ఇంతకాలం నత్తనడక నడచిన ఎలెక్ట్రానిక్‌ పాలన (ఈ-పాలన)ను వడివడి అడుగులు వేయిస్తోంది. లాక్‌డౌన్‌ కాలంలో 50 శాతం కేంద్ర ప్రభుత్వోద్యోగులు ఇళ్ల నుంచి పనిచేయగా, లాక్‌డౌన్‌ ఎత్తివేశాక కూడా వారు నెలకు 15 రోజులపాటు ఇంటినుంచి పనిచేసేలా కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ ఓ ముసాయిదా విధానం వెలువరించింది.

జాతీయ ఇన్ఫర్మేటిక్స్‌ కేంద్రం (ఎన్‌ఐసీ) అందించిన ఇ-ఆఫీస్‌, వీడియో కాన్ఫరెన్సింగ్‌ సౌకర్యాలతో సగంమంది కేంద్ర ఉద్యోగులు లాక్‌డౌన్‌ కాలంలో ఇంటి నుంచి పనిచేయగలిగారు. లాక్‌డౌన్‌ తరవాత కూడా భౌతిక దూరం పాటించడానికి వీలుగా కొంతమంది ఇంటి నుంచి పనిచేసే వీలు కల్పించగలిచారు. వారికి ఆయా మంత్రిత్వ శాఖలు ల్యాప్‌టాప్‌లు లేదా డెస్క్‌టాప్‌ కంప్యూటర్లు అందిస్తాయి. వారి ఇంటర్నెట్‌ రుసుమును కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది. ప్రస్తుతం 75 కేంద్ర మంత్రిత్వ శాఖలు ఈ-ఆఫీసు వేదికను ఉపయోగిస్తుండగా, వాటిలో 57 శాఖలు 80శాతం పనులను ఈ వేదిక మీదే చేస్తున్నాయి.

సంక్షోభంతో వేగవంతం

అందరికీ సాంకేతిక ఫలాలు కార్యాలయ పనుల కంప్యూటరీకరణ లేదా డిజిటలీకరణనే ఈ-ఆఫీస్‌ అంటారు. రహస్య ఫైళ్లకు సంబంధించిన పనులను ఈ వేదిక మీద చేయడం లేదు. తగిన భద్రతా ఏర్పాట్లు చేసుకున్న తరవాత ఈ తరహా పనులకు వీలు కల్పిస్తారు. భారతదేశం 2006లోనే ఎలెక్ట్రానిక్‌ పాలన ప్రణాళికను చేపట్టింది. దీని కింద 2015లో ప్రారంభమైన డిజిటల్‌ ఇండియా పథకం పౌరులందరికీ ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించి ఆన్‌లైన్‌లో వేగంగా ప్రభుత్వ సేవలు అందించాలని లక్షిస్తోంది. ఎలక్ట్రానిక్‌ పాలనా ప్రణాళిక కింద ఆధార్‌, భూ రికార్డుల కంప్యూటరీకరణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈ-సేవ తదితర సౌకర్యాలను ప్రారంభించారు. భారతదేశంలో మెల్లగా వేళ్లూనుకుంటున్న డిజిటల్‌ పాలన కరోనాతో వేగం పుంజుకొంది.

Ground level public service possible through E-Governance
డిజిటల్​ ఇండియా

ఆ సత్తా సాంకేతిక పరిజ్ఞానానికి ఉంది!

చిత్తశుద్ధి ఉంటే డిజిటల్‌ ప్రభుత్వానికి అవినీతిరహిత పారదర్శక పాలనను అందించడం చిటికెలో పని. కొవిడ్‌ వ్యాధి తగ్గుముఖం పట్టిన తరవాత ఆర్థిక వ్యవస్థను ఉత్తుంగ శిఖరాలకు ఉరకలెత్తించాలంటే అవినీతి నిర్మూలన, పారదర్శకత, జవాబుదారీతనం చాలా కీలకమవుతాయి. అవినీతిపై అంకుశంగా, పారదర్శకతకు సైదోడుగా నిలిచే సత్తా సాంకేతిక పరిజ్ఞానానికి ఉంది. డిజిటల్‌ ప్రభుత్వం సాంకేతికత సాయంతో పాలనా ప్రక్రియలను స్వయంచాలితం చేసి, పన్ను చెల్లింపులు, వివిధ గుర్తింపు సంఖ్యల జారీవంటివి ఆన్‌లైన్‌లో జరిపే సౌకర్యం కల్పిస్తుంది. తద్వారా అవినీతికి తావు లేకుండా పౌర సేవలను అందించగలుగుతుంది. డిజిటల్‌ ప్రభుత్వం పౌరుల నమ్మకం, ఆదరణను ప్రోదిచేసుకుంటే, కొవిడ్‌ అనంతరం ప్రగతి రథాన్ని పరుగులు తీయించడానికి కావలసిన నైతిక స్థైర్యం సమకూరుతుంది. కాబట్టి, పౌరులకు సత్వరం డిజిటల్‌ సేవలు అందించడానికి ఇప్పటి నుంచే మౌలిక వసతుల నిర్మాణంపై పెట్టుబడులు పెట్టాలి. కేంద్ర ఉద్యోగులకు విడతలవారీగా ఇంటి నుంచి పని అప్పగించి, వసతులను అందించడం ద్వారా దీనికి కొంత ఊపు వచ్చింది.

అధిగమించాల్సిన అగాధం

డిజిటల్‌ పాలనలో సరిదిద్ధాల్సిన లోపాలు కొన్ని ఉన్నాయి. భారతదేశంలో ఈ ప్రక్రియను సమాజంలో అన్ని వర్గాలు సమాన ఫాయాలో అందుకోలేకపోతున్నాయి. బడుగు వర్గాలను డిజిటల్‌ అక్షరాస్యులుగా మార్చి దేశంలో డిజిటల్‌ అగాధాన్ని అధిగమించాలి. ప్రస్తుతం ఇండియాలో పేదలు ఇంటర్నెట్‌ సౌకర్యం అమర్చుకోలేకపోతున్నారు. గ్రామాలకు పూర్తిస్థాయిలో నెట్‌ సౌకర్యం అందాలంటే ఇంకా సమయం పట్టేట్లుంది. సీనియర్‌ ప్రభుత్వోద్యోగులు, అధికారులు, ప్రైవేటు సంస్థల సిబ్బందికి డిజిటల్‌ పరిజ్ఞాన వినియోగంలో తగిన శిక్షణ ఇవ్వాలి. డిజిటల్‌ ప్రభుత్వానికి పటిష్ఠమైన ఐసీటీ (సమాచార, కమ్యూనికేషన్‌ సాంకేతికత) వ్యవస్థ కావాలి. ఇది ఏర్పడటానికి ప్రధాన సమస్య నిధుల కొరతే. కాబట్టి ప్రైవేటు పెట్టుబడులకూ ప్రవేశం కల్పిస్తున్నారు.

5జీ సేవలతో పరుగులు

త్వరలో 5జీ సేవలు ఐసీటీ రంగంలో విప్లవం తీసుకురానున్నాయి ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం మరింత వేగం పుంజుకోనున్నది. పనులు, వ్యాపారాలు ఆన్‌లైన్‌కు మళ్లిపోయినప్పుడు సైబర్‌ నేరగాళ్ల నుంచి ముప్పు పెరుగుతుందని కరోనా కాలపు అనుభవాలు హెచ్చరిస్తున్నాయి. ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్లు ప్రభుత్వాలు, ప్రైవేటు సంస్థలు సైబర్‌ ప్రతిచర్యలకు దిగడం స్వాగతించాల్సిన అంశం. అలాగే వ్యక్తిగత గోప్యత, వ్యక్తిగత సమాచార రక్షణకు వివిధ దేశాలు తగిన చట్టాలతో ముందుకొస్తున్నాయి. డిజిటల్‌ ప్రభుత్వం తెలివైన, చురుకైన స్మార్ట్‌ ప్రభుత్వంగా నిలవాలంటే కేవలం సాంకేతికతపై పెట్టుబడులు పెట్టగానే సరిపోదు. పారదర్శక, ప్రగతిశీల పాలనలను అందించాలనే రాజకీయ నిబద్ధత కనబరుస్తూ, సంస్థాగత సంస్కరణలు తీసుకురావడం చాలా ముఖ్యం. అన్నింటినీ మించి ధనిక, పేద, పట్టణ-గ్రామీణ తేడా లేకుండా ప్రజలందర్నీ డిజిటల్‌ పౌరులుగా మార్చడం మరీ ముఖ్యం.

ఆదర్శప్రాయంగా ఐరోపా ప్రాజెక్టు

ఈ సందర్భంగా ఐరోపా సమాఖ్య (ఈయూ) ఎలక్ట్రానిక్‌ పాలనపై చేపట్టిన ప్రాజెక్టు గురించి ప్రస్తావించాలి. ఈయూ సభ్య దేశాల ప్రజలకు ప్రభుత్వ విధాన ప్రక్రియలో ఆన్‌లైన్‌ భాగస్వాములయ్యే అవకాశాన్ని ఇచ్చే ప్రాజెక్టు అది. అందుకోసం తగిన ఆన్‌లైన్‌ సాధనాలను అందుబాటులోకి తెచ్చారు. ఒక అడవిని రక్షించడానికి, ఒక ప్రభుత్వ విద్యాసంస్థకు కొత్త మెరుగులు దిద్దడానికి ఆన్‌లైన్‌లో సంతకాల ఉద్యమం చేపట్టి, ప్రభుత్వాలను ప్రభావితం చేసే అవకాశాన్ని ప్రజలకు ఆన్‌లైన్‌ టూల్స్‌ అందిస్తున్నాయి.

డిజిటల్​ ప్రభుత్వానికి ప్రతీక సింగపూర్​

నేడు సింగపూర్‌ను డిజిటల్‌ ప్రభుత్వానికి విశిష్ట ప్రతీకగా చెప్పాలి. 1980లలోనే తమ సివిల్‌ సర్వీసు కంప్యూటరీకరణను ప్రారంభించిన దేశమది. 1990లలో ఆ దేశం జాతీయ బ్రాడ్‌బ్యాండ్‌ యంత్రాంగాన్ని ఏర్పరచింది. 2000 సంవత్సరం నుంచి దేశమంతటా ఉచిత వైఫై హాట్‌స్పాట్‌లను అందుబాటులోకి తెచ్చింది. స్మార్ట్‌ దేశంగా అవతరించే యజ్ఞాన్ని 2014 నుంచి ప్రారంభించింది. సింగపూర్‌ హెల్త్‌ హబ్‌ యాప్‌ ద్వారా ప్రజలు తమ ఆస్పత్రి పరీక్షల వివరాలను స్మార్ట్‌ ఫోన్లలో అందుకోవచ్ఛు. ఉగ్రదాడి వంటి ఏదైనా పెద్ద నేరం జరిగే అవకాశముందని అనుమానం వస్తే సంబంధిత ఫొటోలు, వీడియోలు, సందేశాలను ఎస్‌జీ సెక్యూర్‌ యాప్‌ ద్వారా పంపవచ్ఛు. దేశాభివృద్ధికి తోడ్పడే ప్రతిపాదనలను ఇ-సిటిజన్‌ పోర్టల్‌ ద్వారా పంపవచ్ఛు. సాంకేతికత అందిస్తున్న సౌలభ్యంతో ఇంకా అనేక ప్రపంచ దేశాలు డిజిటల్‌ పాలన వైపు వేగంగా మళ్లుతున్నాయి.

2003లో 33 దేశాలు తమ పౌరులకు కొన్ని ఆన్‌లైన్‌ సేవలను అందిస్తే, 2016 వచ్చేసరికి వాటి సంఖ్య 148కి పెరిగిందని 2016నాటి ఐక్యరాజ్యసమితి ఈ-గవర్నమెంట్‌ సర్వే తెలిపింది. ఇవాళ అనేక దేశాలు పూర్తిస్థాయి డిజిటల్‌ ప్రభుత్వాలుగా మారడానికి నడుంకట్టాయి. ప్రభుత్వ వ్యయానికి సంబంధించిన సమాచారాన్ని 128 దేశాలు తమ ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నాయని ఆ సర్వే తెలిపింది.

- కైజర్‌ అడపా

ఇదీ చూడండి: ఇది ఏటీఎం కాదు.. పానీపూరీ మెషిన్​.!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.