ది హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం కులభూషణ్ కేసులో ఇచ్చిన తీర్పుపై భారత్ తరఫు న్యాయవాది హరీశ్ సాల్వే హర్షం వ్యక్తం చేశారు. పాక్ కపట నీతిని బయటపెట్టి ఐసీజే ముందు వారి కుట్రను వివరించినట్లు తెలిపారు సాల్వే. జాదవ్ నిర్దోషి అని ప్రపంచానికి చాటిచెప్పే ప్రయత్నం చేశానన్నారు.
న్యాయస్థానం తీర్పు తర్వాత లండన్‌లోని భారత హైకమిషన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో సాల్వే మాట్లాడారు.
"జాదవ్‌కు శిక్ష రద్దు చేస్తూ వచ్చిన తీర్పు చాలా సంతోషాన్ని ఇచ్చింది. పట్టుబడిన సమయంలో అతని వద్ద స్వాధీనం చేసుకున్న పాస్‌పోర్టును చూపిస్తూ జాదవ్ జాతీయతను సవాలు చేసేందుకు పాక్ ప్రయత్నించింది. భారత్ వివరణతో జాతీయత, పాస్‌పోర్టు సమస్య కాదని కోర్టు తీర్పునిచ్చింది. జాదవ్ నిర్దోషి అని చెప్పే ప్రయత్నం సఫలమయింది. న్యాయస్థానంలోని 16 మంది న్యాయమూర్తుల్లో 15 మందిని ఒప్పించగలిగాం."
-హరీశ్ సాల్వే, భారత్ తరఫు న్యాయవాది
ఇదీ చూడండి: జాదవ్ మరణశిక్షపై పున:సమీక్షించాల్సిందే: ఐసీజే