ETV Bharat / bharat

'పౌర' చట్టం అమలుపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు: షా - citizenship act latest news

పౌరసత్వ చట్టంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని కేంద్ర మంత్రి అమిత్ షా ఆరోపించారు. చట్టం అమలుపై వెనక్కి తగ్గే సమస్యే లేదని తేల్చి చెప్పారు.

amit-shah
పౌర చట్టం అమలుపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు: షా
author img

By

Published : Jan 3, 2020, 5:16 PM IST

Updated : Jan 3, 2020, 10:46 PM IST

'పౌర' చట్టం అమలుపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు: షా

పౌరసత్వ చట్టం అమలుపై అంగుళం కూడా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా స్పష్టం చేశారు. ఈ చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌లో భాజపా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు షా. పౌర చట్టంపై కాంగ్రెస్‌ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. ఈ చట్టంపై ఎక్కడైనా చర్చకు సిద్ధంగా ఉన్నట్లు విపక్షాలకు సవాల్‌ విసిరారు.

"దేశ ప్రజలందరికీ చెబుతున్నా.. ఇతర దేశాల నుంచి శరణార్థులుగా వచ్చిన వారి హక్కులకు రక్షణగా ఉండే పౌరసత్వ చట్టం అమలుపై మోదీ సర్కారు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. విపక్షాలు ఓటు బ్యాంకు రాజకీయం చేస్తున్నాయి."

-అమిత్ షా, కేంద్ర హోంమంత్రి

పౌర చట్టం వల్ల ఎవరికీ పౌరసత్వం దూరం కాదన్నారు షా. అలాంటి నిబంధన ఎక్కడా లేదని వివరించారు. భారత్‌లోని మైనార్టీలు గౌరవంగా జీవిస్తూ ఉంటే పొరుగు దేశాల్లో మాత్రం మైనార్టీల సంఖ్య తగ్గిపోతోందన్నారు.

ఇదీ చూడండి:మహారాష్ట్రలో చక్రం తిప్పనున్న ఎన్సీపీ?

New Delhi, Jan 03(ANI): Bollywood actor Varun Dhawan took to his Twitter and shared a new poster featuring the next dance number from his upcoming movie 'Street Dancer 3D'. 'Judwaa 2' fame actor shared two posters showcasing two teams ready for a dance battle. The film stars Varun Dhawan, Shraddha Kapoor in lead roles and has Nora Fatehi and Prabhu Deva in pivotal roles too. The trailer was released few weeks earlier and movie will hit the theatre on Jan 24.
Last Updated : Jan 3, 2020, 10:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.