ETV Bharat / bharat

పర్యావరణంపై ఉపాధ్యాయుడి ప్రేమ.. వ్యర్థాలతో అద్భుతాలు - Karnataka updates

పర్యావరణంపై అవగాహన కల్పించేందుకు ఒక్కొక్కరు ఒక్కో రీతిలో కృషి చేస్తుంటారు. పనికిరాని ప్లాస్టిక్​​ వ్యర్థాలతో.. ఉపయోగకరమైన వస్తువుల్ని తయారుచేస్తూ ఔరా అనిపిస్తున్నారు ఓ ఉపాధ్యాయుడు. ఓ వైపు పాఠశాలలో విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధిస్తూనే.. వాడిపారేసిన వస్తువులకు అద్భుత రూపాన్నిస్తూ తన హస్తకళా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. పర్యావరణం గురించి అద్భుత అవగాహన కల్పిస్తోన్న ఆ ఉపాధ్యాయుడెవరో తెలుసుకుందాం..

Govt School teacher became Model for all,
పాఠాలు బోధిస్తూనే.. పర్యావరణంపై అవగాహన.!
author img

By

Published : Jun 5, 2020, 5:50 PM IST

Updated : Jun 5, 2020, 7:24 PM IST

పర్యావరణంపై ఉపాధ్యాయుడి ప్రేమ.. వ్యర్థాలతో అద్భుతాలు

లాక్‌డౌన్‌ కారణంగా ఇంట్లో ఉంటూనే చాలా మంది ఔత్సాహికులు తమలోని ప్రతిభను వెలికితీస్తున్నారు. కర్ణాటకకు చెందిన ఓ ఉపాధ్యాయుడు వాడిపారేసిన ప్లాస్టిక్‌ వస్తువులను.. అందమైన కళాకండాలుగా తీర్చిదిద్దుతున్నారు. వాటిని చెట్లకు వేలాడదీసి తన పెరటి తోటను ఆహ్లాదకరమైన ప్రదేశంగా మార్చారు. పర్యావరణ పరిరక్షణ గురించి ప్రజల్లో అవాగాహన కల్పిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు.

కొడగు జిల్లాకు చెందిన సతీశ్​ పర్యావరణ పరిరక్షణ కోసం తన వంతు కృషిచేస్తున్నారు. పాఠశాలలో విద్యార్థులకు పర్యావరణం అవశ్యకతను బోధిస్తున్న సతీశ్​.. చేతల్లో దానిని చేసి చూపుతున్నారు. పనికిరాని ప్లాస్టిక్‌ డబ్బాలను వృథాగా పోనీయకుండా వాటిని అందమైన వస్తువులుగా రూపొందిస్తున్నారు.

ఇంటి పెరడే అలంకరణ స్థానంగా..

ప్రకృతి ప్రేమికులైన సతీశ్​.. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తూనే కొడగు జిల్లాలో పర్యావరణ పరిరక్షణ గురించి ప్రచారం చేస్తున్నారు. పట్టణంలో వాడిపారేసిన ప్లాస్టిక్ వస్తువులను రీసైకిల్​ చేసి వాటిని అద్భుత కళాకండాలుగా తీర్చిదిద్దుతున్నారు. వీటికి తన ఇంటి పెరడునే అలంకరణ స్థానంగా ఎంచుకున్నారీ ఉపాధ్యాయుడు.

పారేసే వస్తువులకు సరికొత్త రూపం..

ఆయిల్ క్యాన్లు, నీటి సీసాలు, సర్ఫ్​ డబ్బాలను అలంకరణ వస్తువులుగా మార్చిన సతీశ్​.. మార్కెట్లో దొరికే రంగురాళ్లు, గవ్వల్ని ప్లాస్టిక్‌ డబ్బాలకు అమర్చి వాటికి సరికొత్త రూపు తీసుకొచ్చారు. డబ్బాలకు పెయింట్‌ వేసి వాటిని జంతువులు, మనుషుల బొమ్మలుగా మలిచిన ఆయన.. మరికొన్ని వస్తువులను చూడ ముచ్చటైన ఫ్లవర్‌వాచ్​లుగా తయారుచేశారు. వాటిలో పూల మొక్కలు పెంచుతున్నారు. పూలకుండీలను ఓ పద్ధతిలో అమర్చి.. తన పెరటిని ఆహ్లాదకరంగా మార్చారు.

వీటితో పాటు చెట్లకు ప్లాస్టిక్‌ సీసాలను వేలాడదీసి అందులో నీళ్లు పోసి పక్షుల దాహం తీర్చుతున్నారు సతీశ్​. నీళ్లు తాగేందుకు వచ్చే పక్షుల కిలకిల రాగాలతో ఆ పెరడు మార్మోగుతోంది.

ఇదీ చదవండి: ఏనుగు మృతిపై కొత్త ట్విస్ట్- ఆ వార్తలు నమ్మొద్దట

Last Updated : Jun 5, 2020, 7:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.