ETV Bharat / bharat

హ్యాకింగ్ ఘటనతో ట్విట్టర్​కు కేంద్రం నోటీసులు - ట్విట్టర్​కు కేంద్రం నోటిసులు

ప్రపంచవ్యాప్తంగా ప్రముఖుల ట్విట్టర్ ఖాతాలు హ్యాక్ చేసి.. బిట్​ కాయిన్​​ పోస్ట్​లు పెట్టిన నేపథ్యంలో ట్విట్టర్​ సంస్థకు భారత ప్రభుత్వం నోటీసులు పంపింది. హ్యాకింగ్ వల్ల భారత వినియోగదారుల డేటాకు ఏదైనా నష్టం వాటిల్లిందా? అనే వివరాలు సమర్పించాలని సూచించింది.

Govt issues notice to Twitter
ట్విట్టర్​కు కేంద్రం నోటీసులు
author img

By

Published : Jul 18, 2020, 5:59 PM IST

ప్రపంచవ్యాప్తంగా ప్రముఖుల ట్విట్టర్​ ఖాతాల హ్యాక్ ప్రస్తుతం సంచలనం రేపుతోంది. ఈ నేపథ్యంలో ట్విట్టర్​కు భారత సైబర్ సెక్యూరిటీ నోడల్ ఏజెన్సీ.. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్​ టీమ్ (సెర్ట్-ఇన్) నోటీసులు జారీ చేసింది.

హ్యాకింగ్​పై పూర్తి వివరాలు సమర్పించాలని నోటీసుల్లో పేర్కొంది. హ్యాకింగ్​కు గురైన ఖాతాల్లో ఎవరైన భారతీయులు ఉంటే ఆ వివరాలు, వారి డేటాపై ఏమైనా ప్రభావం పడిందా అనే పూర్తి సమాచారం తమకు అందించాలని సూచించింది.

అసలు విషయమేమిటంటే..

జులై 15న మధ్యాహ్నం పలువురు ప్రముఖుల ట్విట్టర్​ ఖాతాలు హ్యాక్​ చేసి అందులో బిట్​కాయిన్​కు సంబంధించిన పోస్ట్​లు పెట్టారు హ్యాకర్లు. ఖాతాలు హ్యాక్​ అయిన వారి జాబితాలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, జో బైడెన్​, బిల్‌గేట్స్‌, వారెన్‌బఫెట్, జెఫ్‌ బెజోస్‌, ఎలాన్‌ మస్క్‌ సహా సెలబ్రిటీలు కేన్​ వెస్ట్​, అతడి భార్య కిమ్​ కర్దాషియన్​ వంటివారు ఉన్నారు.

వీరి అధికారిక ఖాతాల్లో అనుమానాస్పద ట్వీట్లు పెట్టారు సైబర్​ కేటుగాళ్లు. క్రిప్టో కరెన్సీ రూపంలో తమకు డొనేషన్లు కావాలని తర్వాత రెట్టింపు చెల్లిస్తామని సైబర్‌ నేరగాళ్లు మెసేజ్‌లు పెట్టినట్లు ట్విట్టర్​ గుర్తించింది.

ఈ నేపథ్యంలో భారతీ యూజర్ల డేటా భద్రతపై స్పష్టత కోసం కేంద్రం నోటీసులు ఇచ్చింది.

ఇదీ చూడండి:సోషల్ ఇంజనీరింగ్​తో ట్విట్టర్​పై హ్యాకర్ల దాడి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.