ETV Bharat / bharat

తేలికపాటి హెలికాప్టర్‌ ఉత్పత్తికి కేంద్రం పచ్చజెండా - defence sector

భారత సైనిక దళాలు కాలం చెల్లిన హెలికాఫ్టర్లను వీడి మరింత అధునాతన లోహ విహంగాల దిశగా అడుగులు వేస్తున్నాయి. తేలికపాటి హెలికాఫ్టర్లను ఉత్పత్తి చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వ రంగ వైమానిక తయారీ సంస్థ హెచ్​ఏఎల్​కు ప్రాథమిక అనుమతులు ఇచ్చింది ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్​ప్రదేశ్​ లఖ్​నవూలో జరుగుతున్న డిఫెన్స్​ ఎక్స్​పో వేదికగా డీఆర్​డీఓ, హెచ్​ఏఎల్​కు చెందిన అధికారులు ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు.

helicaptor
తేలికపాటి హెలికాప్టర్‌ ఉత్పత్తికి పచ్చజెండా
author img

By

Published : Feb 8, 2020, 7:23 AM IST

Updated : Feb 29, 2020, 2:37 PM IST

భారత సైనిక దళాల్లో కాలం చెల్లిన చీతా, చేతక్‌ హెలికాప్టర్లను వీడ్కోలు పలికేందుకు మార్గం సుగమమైంది. వీటి స్థానంలో తేలికపాటి వినియోగ హెలికాప్టర్లను ఉత్పత్తి చేసేందుకు ప్రభుత్వ రంగ సంస్థ హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) ప్రాథమిక ఆపరేషనల్‌ క్లియరెన్స్‌ (ఐవోసీ) లభించింది. ఈ మేరకు సంబంధిత పత్రాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) ఛైర్మన్‌ జి.సతీశ్‌ రెడ్డి నుంచి హెచ్‌ఏఎల్‌ సీఎండీ ఆర్‌.మాధవన్‌ అందుకున్నారు. లఖ్‌నవూలో జరుగుతున్న రక్షణ ఉత్పత్తుల ప్రదర్శన డిఫెన్స్‌ ఎక్స్‌పోలో ఈ కార్యక్రమం జరిగింది. దీనిలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తదితరులు పాల్గొన్నారు. తేలికపాటి వినియోగ హెలికాప్టర్‌లో ఒక ఇంజిన్‌ ఉంటుంది. బరువు చాలా తక్కువ. సులువుగా విన్యాసాలు చేస్తుంది. అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ పనిచేస్తుంది. వైమానిక దళంతో పాటు సైన్యం అవసరాలు తీర్చేలా దేశీయంగా దీన్ని రూపొందించారు.

ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన రక్షణ ఉత్పత్తుల ప్రదర్శన (డిఫెన్స్‌ ఎక్స్‌పో)లో శుక్రవారం నాటికి 200కుపైగా అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నామని రాజ్‌నాథ్‌ సింగ్‌ చెప్పారు. రక్షణ రంగంలో కేంద్రం తెచ్చిన విధానం ఫలితాలను ఇస్తోందన్నారు. 2018-19లో ఆయుధ ఎగుమతులు రూ.10,745 కోట్లని, 2016-17తో పోలిస్తే ఇది ఏడు రెట్లు ఎక్కువని తెలిపారు.

ఇదీ చూడండి: '2024 నాటికి 5 బిలియన్ల రక్షణ ఉత్పత్తుల ఎగుమతే లక్ష్యం'

ZCZC
PRI ESPL NAT NRG
.SRINAGAR DES34
JK-MODULE
Jaish module busted, 3 held in J-K
          Srinagar, Feb 7 (PTI) A Jaish-e-Mohammad (JeM) module on Friday was busted and three of its associates involved in grenade throwing incident at Lal Chowk here were arrested, police said.
          The JeM associates were identified as Naveed Ul Lateef, Shakeel Ahmad Band and Shamshad Manzoor, all residents of south Kashmir, a police spokesman said.
          "As per police records, they were linked to proscribed terror outfit JeM and were involved in recent grenade lobbing at Pratap Park (Lal Chowk)," he said.
          The spokesman said the trio was involved in establishing terror networks and facilitating the execution of terror activities across the Valley.
          He said further investigation in the case was on and more recoveries and arrests were expected.
          A grenade was hurled on CRPF personnel posted on duty near Pratap Park in busy Lal Chowk area of the city on Sunday, injuring two jawans and seven civilians. PTI MIJ
AQS
02071922
NNNN
Last Updated : Feb 29, 2020, 2:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.