ETV Bharat / bharat

100 కేసులు నమోదయ్యాక ఇదే అత్యల్ప వృద్ధి రేటు! - coronavirus death toll

దేశంలో కొవిడ్‌-19 కేసులు రెట్టింపయ్యేందుకు పడుతున్న కాలం సగటున 9.1 రోజులని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. శుక్రవారం ఉదయం 8 నుంచి శనివారం ఉదయం 8 గంటలకు కొత్త కేసుల వృద్ధిరేటు 6గా నమోదైందని వెల్లడించింది. భారత్‌లో 100 కేసులు దాటిన తర్వాత అత్యల్ప రోజువారీ వృద్ధిరేటు ఇదేనని పేర్కొంది.

gom
మంత్రుల బృందం సమావేశం
author img

By

Published : Apr 25, 2020, 7:57 PM IST

కొవిడ్‌-19పై కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్‌ అధ్యక్షతన అత్యున్నత స్థాయి మంత్రుల కమిటీ సమావేశమయింది. ఈ సమావేశంలో కరోనా కేసుల వృద్ధి రేటు సహా పలు కీలక గణాంకాలను వెల్లడించింది.

  • దేశంలో కరోనా కేసులు రెట్టింపయ్యేందుకు పడుతున్న కాలం సగటున 9.1 రోజులు.
  • శుక్రవారం ఉదయం 8 నుంచి శనివారం ఉదయం 8 గంటలకు కొత్త కేసుల వృద్ధిరేటు 6గా నమోదైంది.
  • భారత్‌లో 100 కేసులు దాటిన తర్వాత అత్యల్ప రోజువారీ వృద్ధిరేటు.

రాష్ట్రాల వారిగా కరోనా కోసం ప్రత్యేక ఆసుపత్రుల ఏర్పాటు, ఐసోలేషన్ బెడ్ల సామర్థ్యం, పీపీఈ కిట్లు, ఎన్​95 మాస్కులు, ఔషధాలు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ సిలిండర్లు వంటి వైద్య పరికరాల లభ్యతపై మంత్రుల బృందానికి వివరించినట్లు ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి.

కిట్ల తయారీ ప్రారంభం..

వైరస్ రక్షణ కిట్లు (పీపీఈ), మాస్కుల కోసం ఇప్పటికే గుర్తించిన తయారీదారి సంస్థలు ఉత్పత్తిని ప్రారంభించాయని వెల్లడించింది మంత్రుల బృందం.

"పీపీఈ కిట్లు, ఎన్​95 మాస్కులు దేశంలో ప్రతిరోజు ఉత్పత్తి అవుతూనే ఉన్నాయి. ప్రస్తుతం పీపీఈ కిట్ల తయారీలో 104 దేశీయ ఉత్పత్తి సంస్థలు భాగమయ్యాయి. ఎన్​95 మాస్కులను మూడు సంస్థలు తయారుచేస్తున్నాయి."

-ఆరోగ్యశాఖ ప్రకటన

వెంటిలేటర్లకు సంబంధించి..

వైరస్ బాధితులకు అవసరమయ్యే వెంటిలేటర్ల తయారీ ఇప్పటికే ప్రారంభమైనట్లు మంత్రుల బృందానికి నివేదించింది ఆరోగ్య శాఖ. తొమ్మిది ఉత్పత్తి సంస్థలకు 59,000 వెంటిలేటర్లు తయారు చేసేందుకు ఆర్డర్లు ఇచ్చినట్లు స్పష్టం చేసింది. మరణాల రేటు తక్కువ ఉండటం పట్ల మంత్రుల బృందం సానుకూలంగా స్పందించినట్లు పేర్కొంది.

"మరణాల రేటు 3.1 శాతంగా ఉండి.. వ్యాధి నయమయ్యే రేటు 20 శాతానికి మించడం పట్ల మంత్రుల బృందం సానుకూలంగా స్పందించింది. ఇది చాలా దేశాల గణాంకాలతో పోల్చితే మెరుగే. లాక్​డౌన్ వల్లే ఇది సాధ్యమయింది."

-ఆరోగ్య శాఖ అధికారులు

ప్రాంతాల వారిగా..

వైరస్ వ్యాప్తి నియంత్రణకు ఇప్పటివరకు కేంద్రం, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు చేపట్టిన చర్యలపై మంత్రుల బృందానికి సవివరంగా తెలిపారు ఆరోగ్య శాఖ అధికారులు.

వైరస్​పై పోరులో..

కరోనాపై పోరులో 92,000 ఎన్​జీఓ, స్వయం సహాయక బృందాలు భాగమవుతున్నట్లు వెల్లడించారు ఆరోగ్య శాఖ అధికారులు.

ఇదీ చూడండి: షాపులు తెరవడంపై హోంశాఖ కొత్త రూల్స్ ఇవే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.