భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి రాజ్యసభ సభ్యునిగా ప్రమాణస్వీకారం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు ఆయనతో ప్రమాణం చేయించారు. జస్టిస్ గొగొయి ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో విపక్ష సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వారి తీరుపై వెంకయ్య అసహనం వ్యక్తం చేశారు.
జస్టిస్ గొగొయిను రాజ్యసభకు నామినేట్ చేశారు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్.
చారిత్రక తీర్పులు..
సీజేఐగా 2018 అక్టోబరు 3 నుంచి 2019 నవంబరు 17 వరకు విధులు నిర్వర్తించారు గొగొయి. ఈయన తన 13 నెలల పదవీ కాలంలో ఎన్నో కీలక తీర్పులు వెలువరించారు.
దశాబ్దాలుగా నలిగిన అయోధ్య కేసులో తీర్పుతో చారిత్రక పరిష్కారం చూపారు జస్టిస్ గొగొయి. రఫేల్ యుద్ధవిమానం, శబరిమల వివాదాలపై కూడా సంచలనాత్మక తీర్పులు ఇచ్చారు.