గోవాలో భాజపాకు కంచుకోటైన పనాజీ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ విజయం సాధించింది. ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ మృతితో జరిగిన ఉపఎన్నికల్లో అధికార భాజపాకు తీవ్ర నిరాశ మిగిలింది.
1994 నుంచి పారికర్...
1994 నుంచి దాదాపు రెండు దశాబ్దాల పాటు పనాజీ అసెంబ్లీ స్థానం నుంచి పారికర్ ప్రాతినిధ్యం వహించారు. ఇటీవలే ఆయన కాలం చేయటం వల్ల ఆ స్థానం ఖాళీ ఏర్పడింది.
1,775 మెజార్టీతో గెలుపు
లోక్సభ ఎన్నికలతో పాటు పనాజీ స్థానానికి నిర్వహించిన ఉపఎన్నికల్లో భాజపా అభ్యర్థి సిద్ధార్థ్ కున్కోలియెంకర్పై కాంగ్రెస్ అభ్యర్థి అటానసియో మోన్సెర్రట్టే 1,775 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
12 స్థానాలకే పరిమితం..
ప్రస్తుతం 40 సీట్ల గోవా అసెంబ్లీలో భాజపా బలం 12. మిత్రపక్షాలు మహారాష్ట్రవాది గోమంటక్ పార్టీ, గోవా ఫార్వర్డ్ పార్టీలతో పాటు ముగ్గురు స్వతంత్రుల మద్దతుతో అధికారం దక్కించుకుంది.
కాంగ్రెస్కు 15 స్థానాల బలమున్నా మిత్రపక్షాలను కలుపుకోవటంలో విఫలమై ప్రతిపక్షంలోనే ఉండిపోవాల్సి వచ్చింది.
ఇదీ చూడండి: నమో 2.0: యావత్ భారతం 'కాషాయ' శోభితం