ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికలను రద్దు చేసి బ్యాలెట్ పద్ధతిలో తిరిగి ఎన్నికలు నిర్వహించాలంటూ సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. ప్రముఖ న్యాయవాది మనోహర్ లాల్ శర్మ దాఖలు చేసిన పిటిషన్‌లో ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహించే హక్కు కేంద్ర ఎన్నికల సంఘానికి లేదని పేర్కొన్నారు.
ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఎన్నికలను బ్యాలెట్ పత్రాల ద్వారానే నిర్వహించాలని కోరారు. పిటిషన్‌ను అత్యవసరంగా విచారణకు స్వీకరించాలని అభ్యర్థించారు.
ఈ పిటిషన్‌తో ఈవీఎంల వ్యవహారం మరోసారి సర్వోన్నత న్యాయస్థానానికి వచ్చింది.
ఇదీ చూడండి: 'కార్యాలయాలకు మంత్రులు సకాలంలో రావాలి'