త్వరలోనే జరగనున్న దిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కసరస్తు ముమ్మరం చేసింది అధికార ఆమ్ ఆద్మీ పార్టీ. ఓటర్లను ఆకట్టుకునేందుకు పలు ప్రకటనలు చేస్తోంది. తమ పార్టీని మరోమారు అధికారంలోకి తీసుకొస్తే.. ప్రస్తుతం కొనసాగుతోన్న మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని మరో ఐదేళ్లు కొనసాగిస్తామని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. దీంతో పాటు 200 యూనిట్ల లోపు వారికి అందించే ఉచిత విద్యుత్ పథకాన్నీ కొనసాగిస్తామన్నారు.
ఈ మేరకు సిరాస్పూర్లోని 1,164 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఈ ప్రకటన చేశారు కేజ్రీవాల్. విపక్షాల విమర్శలను పట్టించుకోకుండా.. ప్రజాసంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు.
" రాజకీయ నాయకులు 4వేల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను వినియోగించుకుంటున్నప్పుడు లేనిది పేద ప్రజలకు 200యూనిట్లు వరకు ఉచితంగా అందిస్తుంటే ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీలు గెలిస్తే ఉచిత బస్సు సర్వీసు, ఉచిత విద్యుత్‌ను ఆపివేస్తామని అంటున్నారు. కానీ నేను అలా చేయనీయను. మీకు హామీ ఇస్తున్నా. నన్ను మీరు మరోమారు అధికారంలో నిలబడితే మరో ఐదేళ్ల పాటు ఈ ఉచిత బస్సు ప్రయాణ సౌకరాన్ని కొనసాగిస్తాను."
-కేజ్రీవాల్, దిల్లీ ముఖ్యమంత్రి.
ఇదీ చూడండి : భారత్- బంగ్లా సరిహద్దు 'స్మార్ట్ ఫెన్స్' వచ్చే ఏడాది పూర్తి