వ్యాపారంలో తీవ్రంగా నష్టపోయిన ఓ కుటుంబం ఘోరానికి పాల్పడింది. అప్పుల ఊబిలో కూరుకుపోయి ఒకే కుటుంబంలో నలుగురు తనువు చాలించిన విషాద ఘటన.. రాజస్థాన్ జైపుర్లో జరిగింది.
జైపుర్ కనోటా పోలీస్ స్టేషన్ పరిధిలోని రాధిక విహాల్ కాలనీలో శుక్రవారం రాత్రి నలుగురు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఫోరెన్సిక్ బృందంతో సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. మృతులను యశ్వంత్ సోని, మమత సోని, భారత్, అజిత్లుగా గుర్తించారు. ఇంటిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు.
అప్పుల బాధతోనే..
ఆత్మహత్యకు పాల్పడిన కుటుంబానికి జైపుర్, అల్వార్లో నగల దుకాణాలు ఉన్నాయని, భారీగా నష్టపోయిన క్రమంలో ఇటీవలే అమ్మకానికి పెట్టినట్లు తెలిసిందని పోలీసులు తెలిపారు.
నగల వ్యాపారంలో తీవ్రంగా నష్టపోయారని, అప్పుల్లో కూరుకుపోయినట్లు స్థానికులూ చెప్పారు. వారికి అప్పు ఇచ్చిన ఓ మహిళ శుక్రవారం రాత్రి వారి ఇంటికి వచ్చి కొన్ని గంటల సమయం వరకు ఇక్కడే ఉన్నట్లు తెలిపారు. రాత్రి 8.30 గంటల ప్రాంతంలో వారిని చివరిసారిగా చూసినట్లు చుట్టుపక్కల వారు చెప్పారు.
ఇదీ చూడండి: చైనాకు సమాచారం చేరవేస్తున్న జర్నలిస్ట్ అరెస్ట్