ETV Bharat / bharat

కశ్మీర్​లో ఉగ్రఘాతుకం- ఓ జవాను, పౌరుడు మృతి - jawans targeted by terrorists

కశ్మీర్​ బారాముల్లా జిల్లా సోపోర్​ వద్ద సీఆర్​పీఎఫ్ బలగాలే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో ఓ సైనికుడు, ఓ సాధారణ పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి.

crpf
కశ్మీర్​లో సీఆర్​పీఎఫ్ జవాన్లపై ముష్కరుల కాల్పులు
author img

By

Published : Jul 1, 2020, 8:55 AM IST

Updated : Jul 2, 2020, 1:01 PM IST

జమ్ముకశ్మీర్ బారాముల్లా జిల్లా సోపోర్​లో సీఆర్​పీఎఫ్ జవాన్లు లక్ష్యంగా కాల్పులకు తెగబడ్డారు ముష్కరులు. ఈ ఘటనలో ఓ జవాను సహా సాధారణ పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సోపోర్​లో తనిఖీలు చేస్తున్న సీఆర్​పీఎఫ్ బలగాలపై ముష్కరులు దాడులు ప్రారంభించారని ప్రకటించారు కశ్మీర్ డీజీపీ దిల్భాగ్ సింగ్. ఉగ్రవాదులు నక్కి ఉన్న ప్రాంతంలో ఆంక్షలు విధించి.. గాలింపు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.

మృత్యుంజయుడీ చిన్నారి..

కాల్పుల్లో చనిపోయిన పౌరుడితో ఓ మూడేళ్ల చిన్నారి కూడా వెంట ఉన్నాడు. బాలుడిని కాల్పుల నుంచి తప్పించి తల్లి వద్దకు చేర్చేందుకు తీసుకెళ్లారు పోలీసులు.

ఇదీ చూడండి: పాక్ కుట్ర భగ్నం- ముగ్గురు ఖలిస్థాన్ ఉగ్రవాదులు అరెస్టు

Last Updated : Jul 2, 2020, 1:01 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.