ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి ఆరోగ్యం క్షీణించింది. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను రాయ్‌పుర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. నేటి ఉదయం స్వగృహంలో ఉండగా ఆయన పరిస్థితి విషమించినట్లు తెలుస్తోంది.
ప్రభుత్వ ఉన్నతాధికారిగా పనిచేసిన జోగి 1986లో కాంగ్రెస్‌లో చేరారు. పార్టీలో, ప్రభుత్వంలో పలు కీలక పదవులు చేపట్టారు. ఛత్తీస్‌గఢ్ సీఎంగా పనిచేసిన ఆయన 2016లో కాంగ్రెస్ నుంచి విడిపోయి జనతా కాంగ్రెస్ పార్టీ స్థాపించారు. ఆయన కుమారుడు అమిత్ జోగి ప్రస్తుతం రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్నారు.