ETV Bharat / bharat

ఆన్​లైన్ క్లాసుల​ కష్టాలు: చెవిపోగులు అమ్మిన తల్లి - స్మార్ట్​ఫోన్​ కోసం చెవిపోగులు అమ్మిన దేవదాసి తల్లి

ఓ పేద దేవదాసి తల్లి... తన కూతురి ఆన్​లైన్​ క్లాసుల కోసం స్మార్ట్‌ఫోన్‌ను కొనేందుకు చెవిపోగులు అమ్మేయాల్సి వచ్చింది. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ కుమార్తె చదువుకు అంతరాయం కలగకూడదని ఈ పని చేసిందా మాతృమూర్తి.

For Her Daughter's Online Classes, Devadasi Mother Sells Her Earrings to buy Smartphone
ఆన్​లైన్ క్లాసుల​ కష్టాలు: చెవిపోగులు అమ్మిన తల్లి
author img

By

Published : Aug 5, 2020, 4:06 PM IST

Updated : Aug 5, 2020, 6:03 PM IST

ఆన్​లైన్ క్లాసుల​ కష్టాలు: చెవిపోగులు అమ్మిన తల్లి

కరోనా విజృంభణతో పాఠశాలలు మూతపడ్డాయి. ప్రత్యామ్నాయంగా ఆన్​లైన్​ పాఠాలు ప్రారంభించాయి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు. ఆర్థిక ఇబ్బందుల వల్ల చాలా మంది ల్యాప్​టాప్​, స్మార్ట్​ఫోన్​లకు ఆమడ దూరంలో ఉన్నారు. అయితే వారిలా తన కూతురు కాకూడదని ఓ పేద దేవదాసి తల్లి.. చెవిపోగులు అమ్మి మరీ స్మార్ట్​ఫోన్​ కొనిచ్చింది.

ఇదీ అసలు కథ!

కర్ణాటక బెళగావి జిల్లా అంకలగి గ్రామానికి చెందిన సరోజిని బెవినకట్టి.. బెళగావి నగరంలో తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటోంది. సరోజిని కుమార్తె రేణుకా పదో తరగతి చదువుతోంది. కుమారుడు ఇంటర్​ ద్వితీయ సంవత్సరం. ఓ ప్రమాదంలో రెండు కాళ్లూ పోగొట్టుకున్నాడు.

తానే అన్నీ అయి కుటుంబాన్ని పోషిస్తూ వస్తోంది సరోజిని. పరిస్థితులు చూస్తుంటే తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ తన చెవిపోగులను అమ్మివేసి.. కుమార్తె ఆన్​లైన్​ పాఠాలు వినేందుకు స్మార్ట్​ఫోన్ కొని ఇచ్చింది సరోజిని.

లాక్​డౌన్​ కారణంగా సావదతి రేణుకా దేవి ఆలయం కూడా మూతపడటం వల్ల జీవనం సాగించడానికి చాలా కష్టంగా ఉందని ఈటీవీ భారత్​కు చెప్పుకొచ్చింది ​దేవదాసి సరోజిని.

ఇదీ చూడండి: తొలిసారి దేశవ్యాప్తంగా మిలిటరీ బ్యాండ్ ప్రదర్శనలు

Last Updated : Aug 5, 2020, 6:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.