ETV Bharat / bharat

'చైనా అసలు లక్ష్యం అరుణాచల్​.. పావుగా పనికొస్తున్న లద్దాఖ్​​' - సరిహద్దు వివాదాలు

చైనా.. తూర్పు లద్దాఖ్​లో ఏప్రిల్​-మే నుంచి ఉద్రిక్తతలు సృష్టిస్తోంది. కయ్యానికి కాలు దువ్వుతోంది. కానీ, డ్రాగన్​ మరోపక్క అంతకుమించిన అస్త్రాలు సిద్ధం చేసుకుంటోంది. అరుణాచల్​ ప్రదేశ్ అసలు లక్ష్యంగా ముందుకొస్తోంది. ఇప్పటికే మెక్​మోహన్​ రేఖ వెంట.. భారీగా సైన్యాన్ని మోహరించింది పీపుల్స్​ లిబరేషన్​ ఆర్మీ. ఇలా చైనా యుద్ధ సన్నద్ధత చాటుతోందని, కొన్ని పర్వతాలు స్వాధీనం చేసుకుంటే.. అరుణాచల్​ అతిక్రమణ తప్పదని అంటున్నారు విశ్లేషకులు.

China, Ladakh
'అరుణాచల్​ అసలు లక్ష్యం... పావుగా పనికొస్తున్న లద్ధాఖ్​'
author img

By

Published : Oct 3, 2020, 8:53 PM IST

Updated : Oct 3, 2020, 9:58 PM IST

అరుణాచల్​ ప్రదేశ్​ తూర్పు సెక్టార్​లో... భారత్-టిబెట్​లను వేరు చేస్తున్న మెక్​మోహన్ రేఖకు కేవలం 16 కిలోమీటర్ల దూరంలో చైనా సైన్యం కీలక స్థావరం ఏర్పాటు చేసుకుంది. గతేడాదే టిబెట్​కు సమీపంలోని యింగ్చీ ప్రాంతంలో ఈ కీలక సైనిక పోస్టు నెలకొల్పింది.

భారత సరిహద్దులోని చివరి అవుట్​పోస్ట్​ అరుణాచల్​లోని.. టూటింగ్. దానికి సమీపంలోని యింగ్చీ వద్ద ఉన్న బేయి.. 52, 53వ మౌంటేన్​ మోటరైజ్డ్ ఇన్​ఫాంట్రీ బ్రిగేడ్​లకు కేంద్రంగా ఉన్నాయి. ఇవి రెండూ టిబెట్​ మిలిటరీ జిల్లా పరిధిలోనే ఉంటాయి.

Arunachal
అరుణాచల్​ లక్ష్యంగా ఎత్తులు

ఈ నేపథ్యంలోనే లద్దాఖ్​లో ఉద్రిక్తతలు సృష్టిస్తున్న చైనా.. అసలు ప్రణాళికలో భాగంగా అరుణాచల్​పై దృష్టి సారించింది. భారత్​ ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. పీపుల్స్​ లిబరేషన్​ ఆర్మీ (పీఎల్​ఏ) మోహరింపుల్లో భాగంగా.. 77 ఆర్మీ గ్రూపులను, సరిహద్దు పహారా రెజిమెంట్లను రంగంలోకి దించింది.

లాసా-యున్నన్ రహదారికి దగ్గర్లోనే ఉన్నాయి ఈ మోహరింపులు. ప్రధానంగా సైన్యం, సైనిక పరికరాలను తరలించేందుకు ఉపయోగపడే విధంగా ఇక్కడి ప్రాంతాన్ని తీర్చిదిద్దారు. ఇక్కడ మరో కీలకమైన రైల్వే జంక్షన్​ కూడా ఏర్పాటు చేశారు.

airport
యింగ్చీ విమానాశ్రయం

ఇక మెక్​మోహన్​ రేఖ సరిహద్దు ప్రాంతంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తూనే.. సైనిక స్థావరాలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తుంది డ్రాగన్​. వ్యూహాత్మక అవసరాలే లక్ష్యంగా పీఎల్​ఏ వేగంగా పావులు కదుపుతోంది. అరుణాచల్ ప్రదేశ్​కు ద్వారాలుగా ఉన్న పర్వతాలను స్వాధీనం చేసుకునే ఆలోచనలో ఉంది.

1962లో చైనా సైన్యం ప్రధానంగా అరుణాచల్​ ప్రదేశ్​... తూర్పు, పశ్చిమ ప్రాంతాలైన తవాంగ్​, వాల్లాంగ్​లోకి చొచ్చుకొచ్చింది. ప్రస్తుతం అరుణాచల్​ సరిహద్దుకు సమాంతరంగా ఉన్న లాసా-యున్నన్ రహదారి.. మెక్​మోహన్​ రేఖతో సంధానం చేసే మార్గాలతో అరుణాచల్​లోకి మరిన్ని మార్గాలు తెరుస్తోంది.

అమెరికాకు చెందిన 'స్ట్రాట్​​ఫర్​' మేధావుల అంచనాల ప్రకారం.. దాదాపు 10 వాయుసేన స్థావరాలు సిక్కిం నుంచి అరుణాచల్​ మధ్య చైనా వాయుసేన ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. 2017 డోక్లాం ఘర్షణల తర్వాతే 7 నెలకొల్పింది. వీటిలో యింగ్చీ సహా మిగతా స్థావరాల్లో ఎలక్ట్రానిక్​ వార్​ఫేర్​ స్టేషన్​లతో సహా అత్యుధునిక సాంకేతికత అందుబాటులోకి తెచ్చింది.

ఈ అదనపు వాయు సామర్థ్యం.. వివాదాస్పద ప్రాంతాల్లో చైనా ఆధిపత్యం ప్రదర్శించేందుకే అంటున్నాయి నివేదికలు. ఉపరితల దాడులకు సహరించేలా ఈ ఏర్పాట్లు ఉన్నాయి. ప్రస్తుతం భౌగోళికంగా తూర్పు లద్దాఖ్​ ప్రాంతంపైనే చైనా దృష్టి సారించినట్లు కనిపిస్తున్నా.. సరిహద్దు వెంట ముఖ్యంగా వివాదాస్పదంగా ఉన్న సిక్కిం, అరుణాచల్​ ప్రదేశ్​లలో భారత్​ మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి.

ఎందుకంటే, వాస్తవాధీన రేఖలా మెక్​మోహన్​ రేఖ వద్ద అంత రక్షణ ఉండదు. ముఖ్యంగా భారత్​వైపు నుంచి దట్టమైన అడవులు, వాతావరణ పరిస్థితులు, దూరం.. ఇలా పరిస్థితులు కఠినంగా ఉంటాయి.

Arunachal
ప్రాంతాలు మావేనంటూ వాదిస్తోన్న చైనా

ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతలను చర్చల ద్వారా పరిష్కరించుకుందామంటూనే.. దాడులకు తెగబడుతోంది చైనా. చర్చల సమయంలో.. సరిహద్దులో భారత్​ మౌలిక సదుపాయాల కల్పనను వ్యతిరేకిస్తుంది. 1959లో చెప్పినట్లుగా ఆ ప్రాంతాలు మావేనంటూ వాదిస్తోంది. అయితే, నాటి చైనా ప్రధాని చౌ-ఎన్​ లై వాదనను... భారత ప్రధాని నెహ్రూ తిరస్కరించారు.

ఈ వాదనలో ప్రమాదకరమైన విషయం ఏంటంటే, 1959 తర్వాత జరిగిన అన్ని చర్చలు, ఒప్పందాలు, అలాగే ప్రస్తుతం కొనసాగుతున్న దౌత్య-సైనిక చర్చలు తిరస్కరణకు గురైనవే. చైనా మెక్​మోహన్​ రేఖను గుర్తించట్లేదు. అదే సమయంలో అరుణాచల్​ ప్రదేశ్​ రాష్ట్రమే కాదంటోంది. ఆ ప్రాంతం టిబెట్​లో అంతర్భాగమని, కాబట్టి చైనాదేనని వాదిస్తోంది.

ఆసక్తికరమైన అంశమేంటంటే, 2017 డోక్లాం సంక్షోభం తర్వాత.. చైనా ఆ ప్రాంతంలో సైనిక సదుపాయల కల్పనను ముమ్మరం చేసింది. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలను ప్రధాన భూభాగంతో అనుసంధానం చేస్తున్న 22 కిలోమీటర్ల 'చికెన్​ నెక్'​ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించింది.

తాజాగా చైనా- భూటాన్​ సరిహద్దు వివాదం రేగిన నేపథ్యం కూడా ఇందుకు సంబంధించిందిగానే కనిపిస్తోంది. సిక్కింతో పాటు భూటాన్​, ఈశాన్య రాష్ట్రాలపై డ్రాగన్​ కన్నేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది.

-సంజీవ్​ బారువా, సీనియర్​ పాత్రికేయులు

Last Updated : Oct 3, 2020, 9:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.