ETV Bharat / bharat

సముద్రగర్భంలో రెపరెపలాడిన త్రివర్ణ పతాకం - సముద్రగర్భంలో రెపరెపలాడిన త్రివర్ణ పతాకం

గుజరాత్​లోని పోర్​బందర్​లో గణతంత్ర దినోత్సవాన్ని వినూత్నంగా నిర్వహించారు. సముద్రం మధ్యలో తేలియాడుతూ మువ్వన్నెల జెండాను ఆవిష్కరించి ధైర్య సాహసాన్ని ప్రదర్శించారు. ద్వారకలోని మరో బృందం.. స్కూబా డైవింగ్​ చేస్తూ సముద్రగర్భంలో జెండాను ఆవిష్కరించారు.

flag off
సముద్రగర్భంలో రెపరెపలాడిన త్రివర్ణ పతాకం
author img

By

Published : Jan 26, 2020, 6:08 PM IST

Updated : Feb 25, 2020, 5:05 PM IST

దేశవ్యాప్తంగా 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గుజరాత్​ పోర్​బందర్​లోని స్థానికులంతా కలిసి వినూత్నంగా జెండాను ఆవిష్కరించారు. సముద్రం మధ్యలో మువ్వన్నెల జెండావందనం చేసి దేశభక్తిని చాటుకున్నారు.

సముద్రపు ఒడ్డు నుంచి కొంత దూరం లోపలికి పోయిన స్థానిక ఈతగాళ్లు.. వాతావరణ పరిస్థితిని ఏమాత్రం ఖాతరు చేయకుండా ఈ కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవాలను గత 20 ఏళ్లుగా ఇలాగే జరుపుకుంటున్నారు ఇక్కడివారు.

flag off
https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5850889_rk1.jpg

"మేం గణతంత్ర వేడుకలు నిర్వహించుకోవడానికి ఇక్కడ కలిశాం. దేశ ప్రజలందరూ కేవలం భూభాగంపై మాత్రమే జెండాను ఎగురవేస్తారు. కానీ మేము మాత్రం సముద్రం మధ్యలో ఆవిష్కరిస్తాము. ఎలాంటి వాతవరణ పరిస్థితి ఎదురైనా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం."

-ఉర్వశి, పోర్​బందర్​ నివాసి.

స్కూబా డైవింగ్​ చేస్తూ

ద్వారకలోని కొంతమంది యువత స్కూబా డైవింగ్​ చేస్తూ సముద్ర గర్భంలో జెండాను ఆవిష్కరించారు. ఇలా స్కూబా డైవింగ్ చేస్తూ సముద్రపు అడుగున జెండా వందనం చేయటం దేశంలో ఇదే తొలిసారి.

సముద్రగర్భంలో రెపరెపలాడిన త్రివర్ణ పతాకం

ఇదీ చూడండి : రక్తం గడ్డకట్టించే చలిలో జవాన్ల గణతంత్ర వేడుకలు

Last Updated : Feb 25, 2020, 5:05 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.