బిహార్ సమస్తిపుర్‌లో ఎడ్లబండిని ఢీకొంది రైలు. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
సమస్తిపుర్-ఖాగరియా తాలూకా హసన్‌పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. గ్రామస్థులు కొందరు ఎడ్లబండిలో పట్టాలు దాటుతుండగా రైలు దూసుకొచ్చింది. రైలు రాకను గమనించి తప్పించుకునే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది.
క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న మృతుల కుటుంబసభ్యలు కన్నీరుమున్నీరవుతున్నారు. రైలు వచ్చే సమయంలో గేట్ వేయకపోవడం వల్లే ఇలా జరిగిందని స్థానికులు వాపోతున్నారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:ముకేశ్ క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరణకు దిల్లీ ఎల్జీ సిఫార్సు