ETV Bharat / bharat

'ప్లాస్మా థెరపీ' చేసిన తొలి కరోనా రోగి మృతి

ఉత్తర్​ప్రదేశ్​లో ప్లాస్మా థెరపీ చేసిన తొలి కరోనా రోగి శనివారం (మే 9న) గుండెపోటుతో మరణించాడు. గత నెల 26న ప్లాస్మా థెరపీ చేసినప్పటి నుంచి ఆయన 14 రోజులుగా వెంటిలేటర్​పై ఉన్నాడని.. పరిస్థితి మెరుగైనప్పటికీ మూత్రాశయ సమస్యలు తలెత్తాయని వైద్యులు వెల్లడించారు.

plasma therapy
ప్లాస్మా థెరపీ చేసిన తొలి కరోనా రోగి మృతి!
author img

By

Published : May 9, 2020, 9:34 PM IST

Updated : May 10, 2020, 8:01 AM IST

కరోనా వైరస్​ చికిత్సలో భాగంగా ఉత్తర్​ప్రదేశ్​లో ప్లాస్మా థెరపీ చేసిన మొట్టమొదటి రోగి శనివారం గుండెపోటుతో మరణించాడు. లఖ్​నవూలోని కింగ్​ జార్జ్​ వైద్య విశ్వవిద్యాలయం (కేజీఎంయూ)లో కొద్ది రోజులుగా చికిత్స పొందుతున్న 58 ఏళ్ల వ్యక్తి.. శనివారం తుదిశ్వాస విడిచినట్లు కేజీఎంయూ ఉప కులపతి​ ఎంఎల్​బీ భట్​ తెలిపారు. గత 14 రోజులుగా వెంటిలేటర్​పైనే చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.

" మొదట్లో రోగి ఆరోగ్యం స్థిమితంగానే ఉంది. అతని ఊపిరితిత్తులు మెరుగయ్యాయి.. కానీ, కొద్ది రోజులకు మూత్రాశయ సమస్యలు తలెత్తాయి. శనివారం సాయంత్రం 5 గంటలకు గుండె పోటు వచ్చింది. వైద్యులు అన్ని విధాల ప్రయత్నించినా.. కాపాడలేకపోయారు. ఈ రోజు వచ్చిన రెండు పరీక్షల ఫలితాల్లో కరోనా నెగిటివ్​గా తేలింది."

- ఎంఎల్​బీ భట్​, కేజీఎంయూ వైస్​ ఛాన్సిలర్​

ఏప్రిల్​ 26న ప్లాస్మా ప్రయోగం..

ఉత్తర్​ప్రదేశ్​​లోని ఒరాయ్​కి చెందిన వ్యక్తి కరోనా లక్షణాలతో లఖ్​నవూలోని కేజీఎంయూలో చేరాడు. కెనడాకు చెందిన వైద్యుడి నుంచి సేకరించిన ప్లాస్మాతో ఏప్రిల్​ 26న బాధితుడికి ప్లాస్మా థెరపీ చేశారు కేజీఎంయూ వైద్యులు.

Last Updated : May 10, 2020, 8:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.