ETV Bharat / bharat

ఈ-విద్యలో 'ఫస్ట్​బెల్​' కొట్టిన కేరళ - కరోనా కాలంలోనూ చిన్నారులు చదివేస్తున్నారు

కరోనా మహమ్మారి వల్ల దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలు బంద్​ అయ్యాయి. మార్చి నుంచి విద్యార్థులు పుస్తకాల వంక చూడటమే మానేశారు. ప్రభుత్వాలు కూడా ఈ ఏడాది పరీక్షలను రద్దు చేసి, ప్రత్యామ్నాయ పద్ధతుల్లో ఫలితాలను విడుదల చేస్తున్నాయి. అయితే విద్యకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే కేరళ మాత్రం ఆన్​లైన్​ స్కూలింగ్​పై దృష్టిసారించింది. రాష్ట్ర వ్యాప్తంగా 'ఫస్ట్​ బెల్​' పేరిట ఓ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ మోడల్​ దేశానికే ఆదర్శంగా నిలిచింది.

First Bell kerala
ఈ-విద్యలో 'ఫస్ట్​బెల్​' కొట్టిన కేరళ
author img

By

Published : Jul 3, 2020, 2:54 PM IST

Updated : Jul 3, 2020, 10:31 PM IST

ఈ-విద్యలో

అడ్మిషన్లు... కొత్త పుస్తకాల కొనుగోళ్లు... సరికొత్త యూనిఫామ్​లతో స్కూళ్లకు పరుగులు... సాధారణంగా ఏటా జూన్​లో కనిపించే దృశ్యాలివి. జూన్​ గడిచిపోయింది. జులై వచ్చింది. అయినా... ఏ విద్యా సంస్థలోనూ 'ప్రవేశాల సందడి' కనిపించడంలేదు. అసలు ఎప్పుడు మొదలవుతుందో కూడా తెలియడంలేదు. కారణం... కరోనా.

కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తున్న తరుణంలో ప్రభుత్వాలు అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. విద్యా సంవత్సరాన్ని నిర్ణీత సమయానికి ప్రారంభించడంకన్నా ప్రజారోగ్య పరిరక్షణే ముఖ్యమని భావించాయి. ఫలితంగా దేశంలోని విద్యా సంస్థలన్నీ అనేక నెలలుగా మూతపడే ఉన్నాయి.

కేరళలోనూ అంతే. ఒక్క పాఠశాల కూడా తెరుచుకోలేదు. కానీ... విద్యా సంవత్సరం ప్రారంభమైంది. అక్కడి పిల్లలు చాలా రోజుల క్రితమే సెలవులకు స్వస్తి పలికి... చదువుల్లో తలమునకలయ్యారు. ఇందుకు కారణం విజయన్ సర్కార్ ప్రారంభించిన ఆన్​లైన్​ క్లాసులే.

'ఫస్ట్​బెల్​' మోగించారు

ఫస్ట్​బెల్​.. కేరళ ప్రభుత్వం రూపొందించిన సరికొత్త విద్యా విధానం​. దీని సాయంతో విద్యార్థుల వద్దకే చదువును చేరుస్తున్నారు. ఇందులో అనేక మాధ్యమాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. టీచర్లు కెమెరా ముందు పాఠాలు బోధిస్తుంటే... పిల్లలేమో టీవీలు, ఫోన్లు, ల్యాప్​ట్యాప్​ల ముందు కూర్చొని ఎంచక్కా తరగతులను వినేస్తున్నారు.

దేశానికే ఆదర్శంగా...

జూన్​ 1న ఫస్ట్​బెల్​ పేరిట ఈ-తరగతులను ప్రారంభించింది కేరళ. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఈ తరహా విధానం అమలు చేయడం దేశంలో ఇదే తొలిసారి. కరోనా సమయంలో ఇలాంటి ప్రత్యామ్నాయ మోడల్​తో విద్యకు ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్రం కూడా ఇదే.

ఇవే మాధ్యమాలు...

1వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులు ఇంటి వద్దే ఉంటూ.. అందుబాటులో ఉన్న టీవీ, ఆన్​లైన్​ పోర్టల్​, యూట్యూబ్​ ఛానెల్​ ద్వారా క్లాసులు వినొచ్చు. ఉదయం 8.30 నుంచి సాయంత్రం 5.30 వరకు సెషన్ల వారీగా పాఠాలు బోధిస్తారు టీచర్లు. ప్రతివారం తరగతులకు సంబంధించిన సెషన్​ టైమ్​ టేబుల్​ను విడుదల చేస్తారు. వాటిని అన్ని మాధ్యమాల్లో ఉంచుతారు. ఎవరైనా పాఠాలు మిస్​ అయితే సాయంత్రం 5.30 తర్వాత మళ్లీ పునః ప్రసారం అవుతాయి.

టీవీల్లో అయితే ఈ క్లాసులను కైట్​ విక్టర్స్​ అనే ఛానెల్​లో ప్రసారం చేస్తున్నారు. ఆన్​లైన్​ పోర్టల్​, యూట్యూబ్​ ఛానెల్​లోనూ ఇదే పేరుతో అకౌంట్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఆయా తరగతుల వారీగా టీచర్లు పాఠాలు బోధిస్తుంటారు. వాటిని రికార్డు చేసి ప్రసారం చేస్తున్నారు.

ఇబ్బందులను అధిగమించి..

ఈ కార్యక్రమం ప్రారంభించిన తొలి వారం ట్రయిల్​ రన్​ నిర్వహించారు. ఇందులో చాలా సాంకేతిక సమస్యలు వచ్చాయి. కేబుల్​ సిగ్నల్​ కట్​ అవడం, విద్యుత్​ అంతరాయం, ప్రసారంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. వాటన్నింటినీ ప్రభుత్వం పరిష్కరించింది. ఏమైనా పాఠాలు మిస్​ అయితే www.victers.kite.kerala.gov.in, facebook.com/victerseduchannel , youtube.co/itsvicter ద్వారా మళ్లీ వినే అవకాశం కల్పించింది.

భారీ స్పందన..

ఈ ఆన్​లైన్​ క్లాసులకు ఊహించని స్పందన లభిస్తోంది. దాదాపు 40 లక్షల మంది ఆన్​లైన్​ క్లాసులకు హాజరవుతున్నట్లు కేరళ ప్రభుత్వం తెలిపింది. ఒక్క యూట్యూబ్​ ఛానెల్​కే 10 లక్షల ఫాలోవర్లు ఉన్నారు.

అయితే ఓ సర్వే ప్రకారం 2 లక్షల మంది చిన్నారులు ఈ క్లాసులు వినలేకపోతున్నారని తెలుసుకున్న ప్రభుత్వ... వారికి ల్యాప్​టాప్​లు అందించేందుకు సిద్ధమైంది. ఎన్​జీఓలు, ప్రైవేటు సంస్థలు, పంచాయతీలు, స్కూల్ మాజీ విద్యార్థులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు.. టీవీలు, స్మార్ట్​ఫోన్లు అందించేందుకు ముందుకొస్తున్నారు. కేరళ స్కూళ్లలో చదువుతున్న కన్నడ, తమిళ మాధ్యమ విద్యార్థులకూ ఈ మాధ్యమాల ద్వారా పాఠాలు బోధిస్తున్నారు. ఇచ్చిన ల్యాప్​టాప్​ల విషయంలో ఆయా స్కూళ్లు వాటి పర్యవేక్షణ చూసుకుంటున్నాయి.

త్వరలో నెలరోజులు పూర్తి చేసుకోనున్న ఈ కార్యక్రమంపై మళ్లీ సమీక్ష చేయనుంది కేరళ ప్రభుత్వం. మెరుగుపర్చాల్సిన అంశాలు, ఇంకా కల్పించాల్సిన సౌకర్యాలపై దృష్టి సారించనుంది. యథావిథిగా పాఠశాలలు ప్రారంభమయ్యేవరకు ఈ పద్ధతినే అనుసరించాలని భావిస్తోంది.

Last Updated : Jul 3, 2020, 10:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.