ETV Bharat / bharat

కశ్మీర్​ ఎన్నికలు: 11 గంటల వరకు 26 శాతం పోలింగ్​ - డీడీసీ ఎలక్షన్స్ న్యూస్

Final phase of Jammu Kashmir DDC Elections Poling
డీడీసీ ఎన్నికల చివరి విడత పోలింగ్
author img

By

Published : Dec 19, 2020, 10:15 AM IST

Updated : Dec 19, 2020, 1:14 PM IST

13:11 December 19

11 గంటల వరకు 26 శాతానికిపైగా పోలింగ్​.. 

జమ్ముకశ్మీర్​ స్థానిక ఎన్నికల పోలింగ్​ ప్రశాంతంగా సాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 26 శాతానికిపైగా ఓటింగ్​ నమోదైంది. 

10:49 December 19

8.93 శాతం ఓటింగ్

జమ్ముకశ్మీర్​ డీడీసీ ఎన్నికల చివరి విడత పోలింగ్ కొనసాగుతోంది. 9 గంటల వరకు 8.93 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

కశ్మీర్​ డివిజన్​లో 5.54 శాతం, జమ్ము డివిజన్​లో అత్యధికంగా 12.43 శాతం ఓటింగ్ నమోదైంది.

09:57 December 19

28 స్థానాల్లో కొనసాగుతున్న ఓటింగ్

జమ్ముకశ్మీర్‌లో స్థానిక సంస్థల (డీడీసీ) చివరి విడత పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు.. పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. ఇప్పటికే 7 విడతల్లో అక్కడి స్థానిక సంస్థలకు పోలింగ్ నిర్వహించగా చివరిదైన 8వ విడత పోలింగ్ శనివారంతో ముగియనుంది.

మొత్తం 28 స్థానాలకు ఓటింగ్ జరుగుతుండగా.. ఇందులో కశ్మీర్ డివిజన్‌లో 13, జమ్ము డివిజన్‌లో 15 సీట్లు ఉన్నాయి. వీటితో పాటు 28 డీసీసీల పరిధిలో ఉన్న 285 పంచ్, 84 సర్పంచ్ స్థానాలకూ పోలింగ్‌ జరుగుతున్నట్లు జమ్ముకశ్మీర్‌ ఎన్నికల కమిషనర్ కేకే శర్మ తెలిపారు. కరోనా నేపథ్యంలో పోలింగ్ స్టేషన్ల వద్ద అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు చెప్పారు. ఓటర్లకు థర్మల్ స్క్రీనింగ్ పరికరాలు, శానిటైజర్లు, మాస్కులు అందుబాటులో ఉన్నట్లు వివరించారు.

Last Updated : Dec 19, 2020, 1:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.