కేంద్ర ప్రభుత్వం చైనాకు చెందిన 59 యాప్‌లను నిషేధించిన నేపథ్యంలో జమ్ముకశ్మీర్, లద్దాఖ్‌లలో అంతర్జాలాన్ని నిలిపివేస్తున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలన్నీ వదంతులేనని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది.
ఈ విషయంపై అమిత్ షా పేరుతో తప్పుడు ట్వీట్లు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నట్లు హోంశాఖ ప్రతినిధి వెల్లడించారు. రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఫిక్స్డ్ లైన్, బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేయనున్నట్లు అందులో ఉన్నట్లు తెలిపారు. అయితే ఈ ట్వీట్ పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు.
-
Claim : A tweet is circulating in the name of Union Home Minister mentioning fixed line broadband and internet in J&K and Ladakh to be snapped.#FactCheck : This tweet is #fake. No such tweet has been done from Union Home Minister’s twitter handle.@PIBFactCheck @DDNewslive pic.twitter.com/2OUlZqBqZK
— Spokesperson, Ministry of Home Affairs (@PIBHomeAffairs) June 30, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Claim : A tweet is circulating in the name of Union Home Minister mentioning fixed line broadband and internet in J&K and Ladakh to be snapped.#FactCheck : This tweet is #fake. No such tweet has been done from Union Home Minister’s twitter handle.@PIBFactCheck @DDNewslive pic.twitter.com/2OUlZqBqZK
— Spokesperson, Ministry of Home Affairs (@PIBHomeAffairs) June 30, 2020Claim : A tweet is circulating in the name of Union Home Minister mentioning fixed line broadband and internet in J&K and Ladakh to be snapped.#FactCheck : This tweet is #fake. No such tweet has been done from Union Home Minister’s twitter handle.@PIBFactCheck @DDNewslive pic.twitter.com/2OUlZqBqZK
— Spokesperson, Ministry of Home Affairs (@PIBHomeAffairs) June 30, 2020
"ఈ ట్వీట్ ఫేక్. కేంద్ర హోంమంత్రి తన ట్విట్టర్ హ్యాండిల్ నుంచి అలాంటి ట్వీట్ చేయలేదు."
-కేంద్ర హోంశాఖ ప్రతినిధి
2జీ అందుబాటులోనే
జులై 8 వరకు హైస్పీడ్ ఇంటర్నెట్పై నిషేధం విధిస్తూ జమ్ము కశ్మీర్ యంత్రాంగం జూన్ 17న నిర్ణయం తీసుకుంది. నియంత్రణ రేఖ వెంబడి చొరబడే ఉగ్రవాదులకు ఇక్కడి నుంచి సమాచారం అందకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. అయితే.. పోస్ట్-పెయిడ్, ఫిక్స్డ్ లైన్ చందాదారులకు 2జీ స్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులోనే ఉంటుందని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి- సరిహద్దు ఘర్షణలపై భారత్-చైనా మరోసారి భేటీ