కేరళ కొల్లం పల్లిముక్కు ప్రాంతానికి చెందిన ఫైజాన్‌కు..10వ తరగతి నుంచి సైక్లింగ్ అంటే చాలా ఇష్టం. ఇంజినీరింగ్ చదవటం కోసం లండన్ వెళ్లినప్పటికీ.. సైక్లింగ్‌ను మాత్రం మరువలేదు. సైకిల్‌తో అమాంతం గాల్లో పల్టీలు కొట్టడం ఫైజాన్‌కు వెన్నతో పెట్టిన విద్య.
ధ్యేయం ఏంటంటే?
'బన్నీ హాప్' అని పిలిచే సైక్లింగ్ ఫీట్స్‌తో పలు విన్యాసాలు చేసి 'లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్'లో స్థానం సంపాదించటమే తన లక్ష్యమంటున్నాడు ఫైజాన్. బన్నీ హాప్ ఒక రకమైన సైకిల్ ట్రిక్. దీని ద్వారా సైకిల్‌ను గాల్లోకి లేపి పలు విన్యాసాలు చేస్తారు రైడర్లు.
నిరంతర కృషి...
నాలుగు నెలల క్రితం లండన్ నుంచి ఇంటికి వచ్చినప్పటికీ.. రోజూ సైకిల్‌తో ప్రాక్టీస్ చేస్తున్నాడు పైజాన్. సైక్లింగ్ నేర్చుకోవాలనుకుంటున్న చిన్న పిల్లలకు కొన్ని చిట్కాలను చెబుతూ వారికి నేర్పిస్తున్నాడు.