సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్బుక్ ఇండియా అధిపతి అజిత్ మోహన్.. పార్లమెంటరీ ప్యానెల్ ఎదుట బుధవారం హాజరయ్యారు. సామాజిక మాధ్యమాల దుర్వినియోగంపై చర్చలో భాగంగా ఆయనను పిలిచింది ఐటీ వ్యవహారాల శాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ.
ఈ కమిటీకి కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ నేతృత్వం వహిస్తున్నారు. దేశ ప్రజల వ్యక్తిగత గోప్యత, హక్కులు, సామాజిక మాధ్యమాల దుర్వినియోగంపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి ఎలక్ట్రానిక్స్, ఐటీశాఖ ప్రతినిధులను కూడా పిలిచింది ప్యానెల్.
భాజపా X కాంగ్రెస్..
విద్వేష వ్యాఖ్యల నిబంధనల నుంచి భాజపా నేతలను విస్మరించారని వచ్చిన వార్తా కథనాలపై ఫేస్‌బుక్‌ను ప్యానెల్ విచారిస్తుందని శశిథరూర్ ఇటీవలే ప్రకటించారు. దీనిపై భాజపా సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ అజెండా కోసం కాంగ్రెస్ పార్టీ.. ప్యానెల్‌ను ఉపయోగించుకుంటోందని ఆరోపించారు భాజపా ఎంపీ నిశాంక్ దుబే. ఆయనను ఛైర్మన్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: ఫేస్బుక్, వాట్సాప్‌పై దర్యాప్తునకు రాహుల్ డిమాండ్