ETV Bharat / bharat

కాంగ్రెస్​ అధికారిక పేజీలు తొలగించిన ఫేస్​బుక్! - కాంగ్రెస్

సామాజిక మాధ్యమం ఫేస్​బుక్ కాంగ్రెస్​ ఫేస్​బుక్​ ఖాతాలోని 687 పేజీల్ని తొలగించింది. ఐటీ సెల్​కు సంబంధించిన కొన్ని అకౌంట్లు కూడా బ్లాక్ చేసింది. అకౌంట్లలో తప్పుడు సమాచారం పోస్ట్​ చేసినట్లు పేర్కొంది.

కాంగ్రెస్​ అధికారిక పేజీలు తొలగించిన ఫేస్​బుక్!
author img

By

Published : Apr 1, 2019, 6:06 PM IST

Updated : Apr 1, 2019, 6:54 PM IST

కాంగ్రెస్​ అధికారిక పేజీలు తొలగించిన ఫేస్​బుక్!
సార్వత్రిక ఎన్నికల ముందు సామాజిక మాధ్యమం ఫేస్​బుక్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాకిచ్చింది. ఆ పార్టీకి చెందిన ఫేస్​బుక్ ఖాతా నుంచి 687 పేజీల్ని తొలగించింది. మరో 103 పేజీల్ని ఇన్​స్టాగ్రాం నుంచి తొలగించామని వెల్లడించింది. ఈ మేరకు ఫేస్​బుక్ సైబర్ సెక్యూరిటీ పాలసీ చీఫ్ నతానియేల్ గ్లెయిచర్ ప్రకటన విడుదల చేశారు. తప్పుడు సమాచారం పోస్ట్ చేయటమే దీనికి కారణమని స్పష్టం చేశారు.

"అనుమానాస్పదంగా వ్యవహరించటమే కాంగ్రెస్ పేజీల్ని తొలగించడానికి కారణం. తప్పుడు అకౌంట్లతో ఒక వలయంగా ఏర్పడి గుర్తింపు దొరక్కుండా, వాటి వెనుక ఎవరున్నారన్నది తెలియకుండా అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్నారు. అందుకే తొలగించాం"-నతానియేల్ గ్లెయిచర్

తమ సామాజిక మాధ్యమాన్ని దుర్వినియోగం చేయకూడదని కొద్దికాలంగా నిఘా ఉంచామని స్పష్టం చేశారు గ్లెయిచర్.

ఫేస్​బుక్, వాట్సాప్​లు ఎన్నికల వేళ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయకుండా కొద్దిరోజులుగా చర్యలు చేపట్టాయి. భారత ప్రభుత్వం సైతం ఎన్నికల ముందు తప్పుడు వార్తల్ని వ్యాప్తి చేయొద్దని ఇటీవల గట్టిగా హెచ్చరించింది.

కాంగ్రెస్ స్పందన...

పేజీల తొలగింపుపై వచ్చిన వార్తా కథనాలను బట్టి వ్యాఖ్యానించటం సరికాదన్నారు కాంగ్రెస్ నేత మనీశ్​ తివారీ. పూర్తిగా పరిశీలించిన తర్వాతే ఈ అంశంపై స్పందిస్తామని స్పష్టం చేశారు.

Intro:Body:Conclusion:
Last Updated : Apr 1, 2019, 6:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.