ETV Bharat / bharat

మీ అసలు రూపాన్ని చెప్పేసే కొత్త మాస్క్​! - Kottayam trendy masks

కరోనా మహమ్మారికి వ్యాక్సిన్​ వచ్చేంత వరకు శరీరంలో వైరస్​ ప్రవేశించకుండా కాపాడే ఏకైక ఆయుధం 'మాస్క్'. ఈ సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకున్న కేరళకు చెందిన ఓ ఫొటోగ్రాఫర్‌.. వినూత్నంగా మాస్క్‌లను రూపొందించి అందర్నీ ఆకర్షిస్తున్నాడు. ఈ మాస్క్​తో ఎదుటి వ్యక్తిని సులభం గుర్తించవచ్చు. అదెలాగో ఓసారి చదవండి.

Face printed masks get trendy in Kottayam, Kerala
కొత్త మాస్క్​ ధరిస్తే ఎవరినైనా గుర్తుపట్టేయొచ్చు!
author img

By

Published : May 25, 2020, 10:17 PM IST

కరోనాతో నెలకొన్న కష్ట కాలంలో ఎక్కడ చూసినా జనం మాస్క్‌లతోనే కనబడుతున్నారు. వ్యాక్సిన్‌ వచ్చేంతవరకు ఈ మహమ్మారితో కలిసి బతకాల్సిన దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి సమయంలో ప్రతిఒక్కరి జీవితంలో మాస్క్ ‌కూడా భాగమైంది.

నిత్యావసరంగా మారిన ఈ రక్షణ తొడుగులకు గిరాకీ ఏర్పడటం వల్ల రోజుకో కొత్త కొత్త వెరైటీలు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. అయితే, మాస్క్‌లు పెట్టుకున్నవారి ముక్కు, నోరు, గడ్డం మూసి ఉండట వల్ల వారిని గుర్తుపట్టడం కష్టంగా మారింది. ఈ 'గుర్తింపు' సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకున్న కేరళకు చెందిన ఓ ఫొటోగ్రాఫర్..‌ వినూత్నంగా ఓ మాస్క్‌ను రూపొందించి తనదైన ప్రత్యేకత చాటుకున్నాడు. కొట్టాయంలో ఏటుమానూరుకు చెందిన 38 ఏళ్ల బినేశ్‌ జి పాల్‌ రూపొందించిన ఈ మాస్క్‌ను ఎవరైనా పెట్టుకుంటే.. అవతలి వాళ్లు వెంటనే గుర్తు పట్టగలరు.

20 నిమిషాల్లోనే మాస్క్‌ రెడీ..

దాదాపు 10 ఏళ్లుగా ఫొటోగ్రఫీ రంగంలో పనిచేస్తున్న బినేశ్‌.. ఈ మాస్క్‌ తయారీ గురించి వివరించాడు.

"ఎవరికైతే మాస్క్‌ తయారు చేస్తున్నామో వారికి హై రిజల్యూషన్‌ కెమెరాతో ఫొటో తీసుకోవాలి. ఆ తర్వాత ఓ ప్రత్యేక కాగితంపై దాన్ని ప్రింట్‌ తీయాలి. అనంతరం ఆ ఫొటోను పెద్ద పరిమాణంలో తీసుకొని మాస్క్‌పై సూపర్‌ఇంపోజ్‌ విధానం ద్వారా అతికించాలి. ఆ సమయంలోనే గడ్డం కొలతను సరిచూసుకుంటాం" అని వివరించారు. అయితే ఫొటోను మాస్క్‌పై అతికించే విధానానికి కేవలం 20 నిమిషాలు మాత్రమే పడుతుందన్నారు. ఒక్కో మాస్క్‌ను రూ.60లకు విక్రయిస్తున్నట్టు బినేశ్‌ వెల్లడించారు.

రెండ్రోజుల్లో 1000 మాస్క్‌లు తయారు చేశా

"నేను రెండు రోజుల్లో 1000 మాస్కులు తయారు చేశా. మరో 5వేల మాస్కులకు ఆర్డర్లు వచ్చాయి. స్థానికంగా ఇలాంటిది ఎవరూ ఇప్పటివరకు తయారు చేయకపోవడం వల్ల దీనిపై నాకు అనేకమంది ప్రశ్నలు అడుగుతున్నారు. ఒకవేళ మాకు ఎక్కువ ఆర్డర్లు వచ్చినా మాస్క్‌ల భద్రత విషయంలో ఏమాత్రం మేం రాజీపడబోం" అని వివరించారు బినేశ్​.

ఈ మాస్క్‌ ఓ సమాధానం

"ఇప్పటికే మార్కెట్లో మిక్కీ మౌస్‌, టామ్‌ అండ్‌ జెర్రీ, డోరా, ఛోటా భీం, టెడ్డీ బేర్‌‌, పలువురు సినీ ప్రముఖులు, అనేక జంతువుల ఆకారాలతో మాస్క్‌లు వచ్చాయి. కానీ ముసుగు‌ వేసుకున్న వ్యక్తిని గుర్తుపట్టగలిగేలా మాస్క్‌లు రాలేదు. ఆ ఆలోచనే నన్ను ఈ వినూత్న మాస్క్‌ తయారు చేసే వైపు నడిపించింది. ఏటీఎంల వద్ద, విమానాశ్రయాల్లో, పరీక్షా హాలులు, ఇతర సందర్భాల్లోనూ మాస్క్‌లు చాలా సమస్యగా మారాయి. అలాంటి సమస్యలను ఈ మాస్క్‌తో అధిగమించవచ్చు" అని బినేశ్ వెల్లడించాడు.

కొత్త మాస్క్​ ధరిస్తే ఎవరినైనా గుర్తుపట్టేయొచ్చు!

ఇదీ చూడండి: క్వారంటైన్​ నిబంధనలను ఉల్లంఘించిన కేంద్ర మంత్రి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.