ETV Bharat / bharat

'దేవుడు సీఎం అయినా.. అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేడు'

ఒకవేళ ఆ దేవుడు ముఖ్యమంత్రి అయినా.. ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వటం సాధ్యం కాదన్నారు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్​ సావంత్​. ప్రభుత్వం తీసుకొచ్చిన స్వయంపూర్ణ మిత్ర కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని సూచించారు.

Goa CM
గోవా ముఖ్యమంత్రి ప్రమోద్​ సావంత్
author img

By

Published : Oct 31, 2020, 2:59 PM IST

దేవుడు కూడా ఆశావాహులందరికీ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేడని పేర్కొన్నారు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్​ సావంత్​. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'స్వయంపూర్ణ మిత్ర' కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం పంచాయతీ ప్రతినిధులతో నిర్వహించిన వెబినార్​లో ఈ మేరకు వ్యాఖ్యానించారు.

" దేవుడు ముఖ్యమంత్రి అయినా, ప్రతిఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వటం సాధ్యం కాదు. వారి (నిరుద్యోగులు) గృహాల్లో కూడా నెలకు రూ.8000 నుంచి రూ.10,000 ఆదాయం ఉండాలి. గోవాలో చాలా ఉపాధి అవకాశాలు ఉన్నాయి. వాటిని బయటి వారు లాక్కెళుతున్నారు. గ్రామీణ నిరుద్యోగులకు చిన్న చిన్న ఉపాధి అవకాశాలు కల్పించటంలో స్వయంపూర్ణ మిత్ర దోహదపడుతుంది."

- ప్రమోద్​ సావంత్​, గోవా ముఖ్యమంత్రి.

స్వయంపూర్ణ మిత్ర కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ గెజిటెడ్​ అధికారులు.. పంచాయతీల్లో పర్యటిస్తూ ప్రభుత్వ పథకాలు ఏమేర అమలవుతున్నాయి, అందుబాటులో ఉన్న వనరుల వంటి సమగ్ర నివేదిక రూపొందిస్తారు. గ్రామాలు స్వయంసమృద్ధి సాధించేందుకు తగిన సూచనలు చేయనున్నారు.

గోవాలో ప్రస్తుతం నిరుద్యోగిత రేటు 15.4 శాతంగా ఉంది. ఈ విషయంలో ఇటీవలే ఆందోళన వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి సావంత్​.

ఇదీ చూడండి: ఒకే దేశం-ఒకే విధానంతో మోదీ స్వప్నం నెరవేరేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.