ETV Bharat / bharat

కశ్మీర్​లో ఎన్​కౌంటర్​.. ఇద్దరు ముష్కరులు హతం

Encounter breaks out in Jammu-Kashmir's Anantnag
కశ్మీర్​లో ఎన్​కౌంటర్​.. ఇద్దరు ముష్కరులు హతం
author img

By

Published : Jun 30, 2020, 8:18 AM IST

Updated : Jun 30, 2020, 11:51 AM IST

08:14 June 30

కశ్మీర్​లో ఎన్​కౌంటర్​.. ఇద్దరు ముష్కరులు హతం

జమ్ముకశ్మీర్​లో ఉగ్ర ఏరివేత కొనసాగుతోంది. ఇవాళ మరో ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టింది సైన్యం. 3 రోజుల క్రితం.. బిజ్​బిహారా ప్రాంతంలో ఓ సీఆర్​పీఎఫ్​ జవాను, మూడేళ్ల బాలుడ్ని బలిగొంది వీరేనని జమ్ముకశ్మీర్​ డీజీ దిల్బాగ్​ సింగ్​ వెల్లడించారు. 

అనంత్​నాగ్​ జిల్లా వాగామా వద్ద ఉగ్రవాదులున్నారన్న సమాచారంతో నిర్బంధ తనిఖీలు చేపట్టాయి భద్రతా దళాలు. ముందే పసిగట్టిన ముష్కరులు.. సైన్యంపై కాల్పులు జరిపారు. ఇది.. ఇరువర్గాల మధ్య ఎన్​కౌంటర్​కు దారితీసింది. బలగాల కాల్పుల్లో ఉగ్రవాదులు హతమయ్యారు. ఘటనా స్థలం నుంచి ఒక ఇన్సాస్​ రైఫిల్​, పిస్తోల్​ను స్వాధీనం చేసుకున్నారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అనంత్​నాగ్​ జిల్లాలోని ఖుల్చోహార్​ ప్రాంతంలో సోమవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ముష్కరులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. 

కాల్పుల విరమణ..

ఇదే సమయంలో జమ్ముకశ్మీర్​లోని నౌగామ్​ సెక్టార్​ వద్ద.. పాక్​ సైన్యం కాల్పుల విరమణ ఉల్లంఘించింది. భారత సైనిక శిబిరాలే లక్ష్యంగా.. మోర్టార్లను ప్రయోగించింది. పాక్​ దుశ్చర్యను భారత సైన్యం దీటుగా తిప్పికొడుతోంది.  

Last Updated : Jun 30, 2020, 11:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.