ETV Bharat / bharat

న్యాయానికి మానని గాయం! - latest national news

దేశంలో ఎన్నో కేసులు సంవత్సరాల తరబడి పెండింగ్​లో ఉంటున్నాయి. వాటి కోవలోకే చేరింది సిక్కుల ఊచకోత. ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ సరైన న్యాయం జరగడం లేదు. వందల కొద్దీ కేసులున్నా.. శిక్షలు పడింది మాత్రం పదుల సంఖ్యలోనే. అసలీ ఘటన వెనుక ఉన్నదెవరూ. ఇప్పటివరకూ ఎందుకు బాధిత కుటుంబాలకు న్యాయం జరగడం లేదు.

editorial news
న్యాయానికి మానని గాయం!
author img

By

Published : Jan 19, 2020, 7:21 AM IST

మనిషిలోని మృగప్రవృత్తి జూలు విదిలించినప్పుడల్లా నేరాలూ ఘోరాలూ జరుగుతూనే ఉన్నాయి. వందమంది నేరగాళ్లు తప్పించుకొన్నా ఫరవాలేదు గాని, ఏ ఒక్క నిర్దోషికీ శిక్ష పడరాదన్న సమున్నతాదర్శం కొన్ని దశాబ్దాలపాటు భారత న్యాయపాలిక కరదీపిక కావడంతో- తప్పు చేసీ తప్పించుకోగలమన్న దిలాసాతో నేరగాళ్లకు కోరలూ కొమ్ములూ మొలుచుకొచ్చాయి. ‘ఏ ఒక్క నేరగాడూ తప్పించుకోరాదు- మరే నిర్దోషీ శిక్షకు గురి కారాదు’ అంటూ సుప్రీంకోర్టు గురి సరిచూసే నాటికే రాజకీయం నేరం అద్వైతసిద్ధి పొందాయి. తనవంతుగా నేరన్యాయ వ్యవస్థ గాంధీగారి మూడు కోతుల సిద్ధాంతాన్ని నిష్ఠగా పాటించడం మొదలుపెట్టింది. రాజకీయ నేరగాళ్లు చేసే ‘చెడు’ను కనడం-వినడం- దానిపై మాట్లాడటం మహాపాపమని అది తీర్మానించేసుకొన్న తీరును జస్టిస్‌ ధింగ్రా కమిటీ తాజాగా కళ్లకు కట్టింది. ఆ వివరం చిత్తగించండి!

'మహావృక్షం నేలకూలినప్పుడు సమీప భూమి కంపించడం సహజం'- ఈ సిద్ధాంతాన్ని ప్రవచించింది ఏ వృక్షశాస్త్రవేత్తో, భూభౌతిక శాస్త్ర నిపుణుడో కాదు. 1984లో ప్రధాని ఇందిర అంగరక్షకుల చేతిలోనే దారుణ హత్యకు గురైన నేపథ్యంలో- అమాయక సిక్కుల ఊచకోత యథేచ్ఛగా సాగిపోవడంపై నయాప్రధానిగా రాజీవ్‌ స్పందన అది. ‘రాజకీయ నాయకులను నిందితులుగా పేర్కొంటూ బాధితులు దాఖలు చేసిన ప్రమాణ పత్రాలను ప్రభుత్వం తొక్కిపట్టింది... సిక్కులకు గుణపాఠం నేర్పడానికి హత్యాకాండ అవసరమని, నరమేధానికి సూత్రధారుల్ని తప్పనిసరిగా రక్షించాలనీ ప్రభుత్వం భావిస్తున్నట్లుంది’- 1996లో సంబంధిత కేసుల్ని విచారించిన దిల్లీ అదనపు సెషన్స్‌ న్యాయమూర్తి చేసిన వ్యాఖ్య ఇది. దేశ రాజధానితోపాటు యూపీ, హరియాణా, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర లాంటిచోట్ల 3,300 పైగా అభాగ్యుల ప్రాణాల్ని కబళించిన ఘోరకలిని దేశ విభజన కాలంనాటి మతఘర్షణలతో పోల్చి నేరస్వభావాన్ని మసిపూసి మారేడు చేసేందుకు కాంగ్రెస్‌ అధిష్ఠానం తెగించింది. అధినేతల మనసెరిగి మసలుకోవడంలో భిన్న యంత్రాంగాల విధిద్రోహం ఏ స్థాయికి చేరిందో జస్టిస్‌ ధింగ్రా కమిటీ పూసగుచ్చింది!

ఎందుకు అలసత్వం

'సిక్కుల ఊచకోతకు సంబంధించి క్రిమినల్‌ కేసుల్ని ఏదోవిధంగా మూసేయడానికే పోలీసు వ్యవస్థ, పాలన యంత్రాంగం అవిశ్రాంతంగా పరిశ్రమించాయి' అని జస్టిస్‌ ధింగ్రా కమిటీ నిగ్గుతేల్చింది. హత్యలు, లూటీలు, దహనకాండలకు సంబంధించి జస్టిస్‌ రంగనాథ్‌ మిశ్రా కమిషన్‌కు బాధితులు వందలకొద్దీ ప్రమాణ పత్రాలు సమర్పించినా- వాటి ఆధారంగా ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్‌)లు రూపొందించాల్సింది పోయి, కమిటీల మీద కమిటీల ఏర్పాటుతో కేసుల నమోదు తతంగాన్ని ఏళ్ల తరబడి సాగదీసిన దురాగతం నమోదైంది. దిల్లీలోని కల్యాణ్‌పురి ఠాణా అధికారి ఎస్‌ఎస్‌ త్యాగి హంతకుల కుట్రలో భాగస్వామిగా మారి సిక్కులను నిరాయుధుల్ని చెయ్యడం ద్వారా వారిని మూకహింసాగ్నికి సమిధలుగా మార్చేశారనీ జస్టిస్‌ ధింగ్రా కమిటీ సూటిగా ఆక్షేపించింది. కేసుల్ని నీరుగారిపోయేలా చేయడంలో పోలీసులు ప్రదర్శించిన టక్కుటమార విద్యలూ ఇన్నన్ని కావు. పరస్పరం ఏమాత్రం సంబంధం లేని 337 వేర్వేరు ఫిర్యాదుల్ని కలగలిపి అత్యంత భారీ ఎఫ్‌ఐఆర్‌ ఒక్కటే నమోదు చేసిన పోలీసుల కపటనాటక కౌశల విన్యాసం చెప్పనలవి కాదు!

ఫిర్యాదుల దర్యాప్తు మానవమాత్రులకు అసాధ్యమయ్యే రీతిలో పోలీసులు కావాలనే అలా వ్యవహరించారు. ‘ఒక్క దర్యాప్తు అధికారి ఏకంగా 500 కేసుల్ని చేపట్టి, సాక్షుల్ని కనుగొని, గట్టి ఆధారాలు సేకరించి, కోర్టులో నిందితులకు వ్యతిరేకంగా ఎలా ముందడుగు వెయ్యగలుగుతా’రన్న జస్టిస్‌ ధింగ్రా ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిందెవరు? మూడున్నర దశాబ్దాలుగా కేసులు కొనసాగుతూ దోషులు దర్జాగా తిరగగలుగుతున్నారంటే- పోలీసు అధికారుల్లో చిత్తశుద్ధి లేకపోవడమే కారణమన్న కమిటీ వ్యాఖ్యను కాదనగలవారెవ్వరు?

దశాబ్దాలుగా బాధను దిగమింగుతూ

న్యాయం చెయ్యడమే కాదు, చేస్తున్నట్లూ కనిపించాలన్నది సాధారణ న్యాయసూత్రం. మూడున్నర దశాబ్దాలుగా ఊచకోత బాధిత కుటుంబాలకు జరుగుతున్నది మాత్రం ఘోరమైన అన్యాయం. నాలుగు కమిషన్లు, పది కమిటీలు, రెండు ప్రత్యేక దర్యాప్తు బృందాలూ కొలువుతీరి వేల పేజీల నివేదికల్లో వాస్తవాల్ని క్రోడీకరించినా సిక్కు సోదరుల గుండెగాయాల్ని మాన్పే న్యాయం అనే మందు నేటికీ అందకపోవడం ఆలోచనాపరుల్ని కలచివేస్తోంది. ఒక్క దిల్లీ మహానగరంలోనే 2,733 మంది నిస్సహాయంగా కడతేరిపోయినట్లు అధికారిక గణాంకాలు ఘోషిస్తున్నా, దాదాపు నాలుగు వేలమంది ప్రాణాలు కోల్పోయారని మానవ హక్కుల సంఘాలు మొత్తుకొంటున్నాయి. నానావతి కమిషన్‌ పేర్కొన్నదాని ప్రకారం 587 ఎఫ్‌ఐఆర్‌లు నమోదుకాగా ఇప్పటికి దాదాపు 30 కేసుల్లోనే శిక్షలు పడ్డాయని వార్తాకథనాలు చాటుతున్నాయి. ఐపీఎస్‌ అధికారి ప్రమోద్‌ ఆస్థానా సారథ్యంలో 2015లో ఏర్పాటైన కమిటీ- 199 కేసుల్ని పరిశీలించి వాటిని మూసేసినట్లు 2017 మార్చిలో సుప్రీంకోర్టుకు తెలిపింది. కేసులు మూసివేస్తూ ఆస్థానా కమిటీ తీసుకొన్న నిర్ణయంలోని హేతుబద్ధత పరిశీలనకు ఏర్పాటైన జస్టిస్‌ ధింగ్రా కమిటీ- ప్రాసిక్యూషన్‌ ఘోర వైఫల్యాల్ని, చాలా మామూలుగా జడ్జీలు కేసుల్ని కొట్టివేయడాన్ని ప్రస్తావించింది.

1984నాటి హత్యాకాండ పట్ల, ఎఫ్‌ఐఆర్‌లు, సాక్షుల వాంగ్మూలాల నమోదులో జాప్యానికి బాధితులు బాధ్యులు కారన్న సదవగాహన జడ్జీలకు కొరవడిందన్న సంగతి తీర్పుల్లో ప్రతిఫలిస్తోందన్న జస్టిస్‌ ధింగ్రా కమిటీ ఆక్షేపణ- మొత్తం నేరన్యాయ వ్యవస్థ ఎలా పడకేసిందో వేలెత్తి చూపుతోంది. దశాబ్దాలుగా వ్యవస్థాగతమైపోయిన ఈ హేయ నిర్వాకాలే సిక్కుల హృదయాలకు తగిలిన గాయంపై గునపం పోటులా మారి వారిలో తీవ్ర ఆవేదన రగిలిస్తున్నాయి!

‘అన్ని ఊచకోతల లక్ష్యం మైనారిటీలే. 1984 విషాదం, గుజరాత్‌, కంధమాల్‌, ముజఫర్‌నగర్‌ ఘర్షణలన్నీ ఆ కోవలోనివే! రాజకీయ ప్రాపకం కలిగిన శక్తులు సామూహిక హత్యలు చేస్తున్నాయి. పోలీసు వ్యవస్థ వాళ్లకు సహకరిస్తోంది’- 2018 డిసెంబరులో దిల్లీ హైకోర్టు ఇచ్చిన కీలక తీర్పులోని వ్యాఖ్యలవి. సిక్కుల ఊచకోత కేసులో కాంగ్రెస్‌ నేత, ఆనాటి ఎంపీ సజ్జన్‌ కుమార్‌కు జీవిత ఖైదు విధించిన న్యాయస్థానం- బతికిఉన్నన్నాళ్లూ ఆయన జైల్లోనే గడపాలనీ నిర్దేశించింది. ‘హత్యలను ప్రోత్సహించిన సజ్జన్‌... శాంతి ర్యాలీలు, రక్తదాన శిబిరాలూ నిర్వహిస్తే సరిపోతుందా’ అన్న న్యాయపాలిక ప్రశ్న- గోముఖ వ్యాఘ్రాల గుండెల్ని చీల్చేసే తూటా! దిల్లీ అల్లర్లు మానవాళిపైనే మహానేరం అంటూ అలాంటి కేసుల విచారణకు ప్రత్యేక చట్టం తేవాలన్నది హైకోర్టు సూచన. చట్టాల్ని చాపచుట్టి అస్మదీయులకు చుట్టాలుగా మార్చేయడంలో నేర రాజకీయాల ఉరవడి ఠారెత్తిస్తోంది. నేరన్యాయానికి పట్టిన రాజకీయ గ్రహణం రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన సమన్యాయ భావనకే ఉరితాళ్లు పేనుతోంది. ఆ దురవస్థ రూపుమాసిపోవాలంటే, రాజకీయాలు నేరరహితం కావాలి. ఆ మంచిరోజు రహించేలా పౌరులే పూనిక వహించాలి. ఏమంటారు?

- పర్వతం మూర్తి

ZCZC
PRI GEN LGL NAT
.LUCKNOW LGD29
UP-COURT-JOSHI
Non-bailable warrants issued against BJP MP Rita Bahuguna, others for evading court proceedings in 2015 stone-pelting incident
          Lucknow, Jan 18 (PTI) A special court on Saturday issued non-bailable warrants against BJP MP Rita Bahuguna Joshi and others for evading court proceedings in a case related to a 2015 incident during an agitation by the Congress when she was in the opposition party.
          Special Judge P K Rai issued the warrant against Joshi, Congress leader Ajay Rai and four others who were chargesheeted in December 2015 in connection with the incident in which several policemen and administration officials were injured.
          Joshi, who was in the Congress then, had joined the BJP in October 2016
          The court lamented that despite a Supreme Court order for expeditious proceedings in the matter charges could not be framed as the accused were not appearing in the court.
          Other accused, including Congress leader Raj Babbar, were granted exemption from appearance on Saturday by the court which instructed them to be present during the next hearing.
          "It has been four years since the incident took place in 2015, but the charges could not be framed against the accused in the matter as some of them still have not appeared in the court and are evading the proceedings despite the fact that the Supreme Court has directed to decide the case in an expeditious manner," the court said.
          It fixed February 1 as the next date of hearing in the matter.
          The Congress had staged an agitation on August 17, 2015, at Laxman Mela ground in Lucknow. A crowd of about 5,000 party workers, all of a sudden, set out for Uttar Pradesh Vidhan Bhavan from the venue of the protest. When police and district administration officials tried to stop them near Sankalp Vatika, the workers allegedly started pelting stones at them.
          Several people as well as policemen and administration officials were injured and the law and order was badly disturbed.
          An FIR was lodged by sub-inspector Pyare Lal Prajapati on August 17, 2015, at Hazratganj police station in connection with the incident.
          After investigation, police filed a charge sheet against the accused in the case on December 25, 2015, under several IPC offences and the Criminal Law Amendment Act.
          Other accused in the case are Nirmal Khatri, Pradeep Mathur, K K Sharma, Rajeshpati Tripathi and Pradeep Aditya Jain. PTI CORR NAV
AQS
AQS
01182148
NNNN
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.