ETV Bharat / bharat

కమల్​నాథ్ అనుచిత వ్యాఖ్యలపై నివేదిక కోరిన ఈసీ - మధ్యప్రదేశ్​ ఉపఎన్నికలు

భాజపా అభ్యర్థిపై కాంగ్రెస్ సీనియర్ నేత కమల్​నాథ్​ అనుచిత వ్యాఖ్యలపై రాష్ట్ర సీఈసీని భారత ఎన్నికల సంఘం నివేదిక కోరింది. ఎన్నికల ప్రచారంలో కమల్​నాథ్​ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగిన నేపథ్యంలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది ఈసీఐ.

Kamal Nath
కమల్​నాథ్
author img

By

Published : Oct 20, 2020, 5:09 AM IST

మధ్యప్రదేశ్​ మాజీ సీఎం కమల్​నాథ్ అనుచిత వ్యాఖ్యలపై రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి(సీఈసీ)ని పూర్తి నివేదికను అందజేయాలని ఈసీఐ ఆదేశించింది. సీఈసీకి జాతీయ మహిళా కమిషన్ లేఖ రాసిన తర్వాత భారత ఎన్నికల సంఘం వివరణ కోరింది.

మధ్యప్రదేశ్​ ఉప ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. కమల్​నాథ్​​ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర రాజకీయ దుమారం చెలరేగింది. కాంగ్రెస్​ తరఫున ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించిన కమల్​నాథ్​.. భాజపా మహిళా అభ్యర్థి ఇమార్తీ దేవిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.

మధ్యప్రదేశ్​లో కాంగ్రెస్​ ప్రభుత్వం కుప్పకూలే సమయానికి ఇమార్తీ దేవి రాష్ట్ర కేబినెట్​ మంత్రిగా ఉన్నారు. అనంతరం భాజపా గూటికి చేరి తాజాగా ఉపఎన్నికల్లో పోటీచేస్తున్నారు. దేవి కాంగ్రెస్​కు ద్రోహం చేశారని.. ఆమె వ్యవహారం తనకు ముందు తెలియదని పేర్కొన్నారు కమల్​నాథ్​. ఈ నేపథ్యంలోనే పలు అనుచిత వ్యాఖ్యలు చేశారు​.

ఇదీ చూడండి: కమల్​నాథ్​ అనుచిత వ్యాఖ్యలపై దుమారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.