ETV Bharat / bharat

'ఐటం' వ్యాఖ్యలపై కమల్​​కు ఈసీ నోటీసులు

మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమ్​ల్​నాథ్​కు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా భాజపా మహిళా అభ్యర్థిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు వివరణ ఇవ్వాలని కోరింది. 48 గంటల గడువిచ్చింది.

EC notice to Kamal Nath on 'item' jibe
'ఐటెం' వ్యాఖ్యలపై కమల్​నాథ్​కు ఈసీ నోటీసులు
author img

By

Published : Oct 21, 2020, 7:45 PM IST

రాజకీయంగా తీవ్ర దుమారం రేపిన 'ఐటం' వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్​నాథ్​కు నోటీసులు జారీ చేసింది ఎన్నికల సంఘం. 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. లేకపోతే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. కమల్​నాథ్ వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినట్లేనని పేర్కొంది.

అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్వాలియర్​లో నిర్వహించిన ఓ ర్యాలీలో ఆదివారం పాల్గొన్నారు కమల్​ నాథ్. భాజపా మహిళా అభ్యర్థిని ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు.

కమల్​నాథ్ వ్యాఖ్యలపై భాజపా మండిపడింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సోమవారం నిరసనకు కూడా దిగారు. జాతీయ మహిళా కమిషన్​ కమల్​నాథ్​ను ఇప్పటికే వివరణ కోరింది.

ఇదీ చూడండి: కమల్​నాథ్​ అనుచిత వ్యాఖ్యలపై దుమారం

ఆ వ్యాఖ్యలు ఎవరు చేసినా ఆమోదించను: రాహుల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.