భాజపా ఎంపీ, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది ఎన్నికల సంఘం. దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనే ఆరపణలపై ఈ చర్యలు తీసుకుంది ఈసీ. నోటీసులపై జనవరి 30 మధ్యాహ్నం 12 గంటలలోపు స్పందన తెలపాలని ఆదేశించింది. దిల్లీ ఎన్నికల ప్రధాన అధికారి... ఈ విషయంపై ఈసీకి నివేదిక సమర్పించిన తర్వాత ఠాకూర్‌కు నోటీసు అందింది.
ఏం అన్నారు?..
దిల్లీలో ఫిబ్రవరి 8న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. భాజపా అభ్యర్థి తరఫున సోమవారం ప్రచారం చేశారు అనురాగ్ ఠాకూర్. సీఏఏను వ్యతిరేకిస్తున్న వారిపై విరుచుకుపడ్డారు. అలాంటి వారిని దేశద్రోహులుగా పరిగణించి కాల్చేయాలని ఆరోపించారు.