ETV Bharat / bharat

ఈ ఉల్లిపాయలు తింటే కరోనా దరిచేరదట!

చైనాలో పుట్టి ప్రపంచమంతా వ్యాపిస్తున్న కరోనా వైరస్​ను.. చిన్న ఉల్లిపాయలు తినడం ద్వారా నివారించవచ్చని చెబుతున్నారు తమిళనాడు కరైకుడికి చెందిన ఓ హోటల్ యజమాని. ఇది తమిళ సంప్రదాయ వైద్య చిట్కా అని, దీని ద్వారా కరోనాను కచ్చితంగా అడ్డుకోవచ్చని అంటున్నారు.

author img

By

Published : Feb 3, 2020, 9:24 AM IST

Updated : Feb 28, 2020, 11:37 PM IST

Eat onion Oothappam away from corona virus tamil nadu hotel owner
ఈ ఉల్లిపాయలు తింటే కరోనా దరిచేరదట!
ఈ ఉల్లిపాయలు తింటే కరోనా దరిచేరదట!

చిన్న ఉల్లిపాయలు తింటే కరోనా వైరస్ దరిచేరదని తమిళనాడు కరైకుడికి చెందిన ఓ హోటల్ యజమాని చెబుతున్నారు. ఇది తమిళ సంప్రదాయ వైద్య పద్ధతి అని ఆయన తెలిపారు. తమ హోటల్​కు వచ్చిన వారికి కచ్చితంగా ఈ చిన్న ఉల్లిని అందిస్తున్నామని ఆయన వెల్లడించారు.

చైనాలో పుట్టిన కరోనా ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఈ అంటువ్యాధి వలన చైనాలో ఇప్పటి వరకు 300 మందికి పైగా చనిపోయారు. 17 వేలమందికి పైగా ఈ వైరస్ సోకింది. పరిస్థితి తీవ్రత దృష్ట్యా ప్రపంచ ఆరోగ్య సంస్థ... అంతర్జాతీయ వైద్య అత్యవసర పరిస్థితినీ ప్రకటించింది.

భారత్​కు చేరిన కరోనా

భారత్​కు సంబంధించి కేరళలో ఇప్పటి వరకు రెండు కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. బాధితుల్లో ఒకరు చైనాలో చదువుకుంటున్న విద్యార్థి కాగా, మరొకరు చైనాకు స్వవిషయమై పయనమై వచ్చినవారు.

వంటింటి వైద్యం!

ఇలాంటి పరిస్థితుల్లో వంటింటి వైద్యం సూచించి అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది ఈ తమిళ హోటల్ యాజమాన్యం. కేవలం చిన్న ఉల్లిపాయలు తినడం వల్ల కరోనా సోకకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చని, ఈ ప్రాణాంతక వైరస్​ వ్యాప్తిని అడ్డుకోవచ్చని నమ్మకంగా చెబుతున్నారు. ఇది ఎంతవరకు నిజమనేది శాస్త్రవేత్తలే తెలియజేయాలి.

ఇదీ చూడండి: మెక్సికో: అది మ్యూజియమా.. డాన్​ స్థావరమా!

Intro:Body:

Eat onion Oothappam away from corona virus tamil nadu hotel owner 

Conclusion:
Last Updated : Feb 28, 2020, 11:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.