కరోనా కాలంలో ఏ చిన్నపాటి అశ్రద్ధకైనా భారీ మూల్యం చెల్లించాల్సిందే. ప్రస్తుతం చాలా మంది దేనినైనా తాకితే వెంటనే శానిటైజర్‌తో చేతులను శుభ్రపరుచుకుంటున్నారు. అయితే ఎక్కువ మంది వినియోగించే ఆ శానిటైజర్ బాటిల్‌ను మీరు చేతితో పట్టుకోవడమూ ప్రమాదమే. ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తూ భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) వినూత్న ఆవిష్కరణ చేసింది.
కాంటాక్ట్‌లెస్ శానిటైజర్ డిస్పెన్సర్‌ను తయారు చేసి.. దిల్లీలోని ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసింది డీఆర్డీఓ. భవనంలోకి ప్రవేశించే వారు తాకకుండానే చేతిపై 20 క్షణాల పాటు శానిటైజర్ వేస్తోంది ఈ పరికరం. వీటిని త్వరలోనే పలు సంస్థలకు అందజేయనున్నట్లు డీఆర్డీఓ ఛైర్మన్ సాంకేతిక సలహాదారు ఎస్ జోషి స్పష్టం చేశారు.
- ఇదీ చూడండి: లాక్డౌన్ వేళ 'కరోనా విందు'- ఒకరు అరెస్ట్