Ex CM KCR Sister Passes Away : మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సోదరి సకలమ్మ అనారోగ్య కారణాల రీత్యా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో అత్యవసర చికిత్స విభాగంలో చేరిన సకలమ్మ శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా వయోభారంతో పాటు అనారోగ్య సమస్యలతో సకలమ్మ వైద్య చికిత్సలు తీసుకుంటున్నారు. ఓల్డ్ ఆల్వాల్ సాయిబాబా నగర్‌లోని టీఎస్‌ఆర్ గోల్డెన్ లీఫ్ అపార్ట్‌మెంట్‌లో ఆమె నివాసం ఉంటున్నారు. ఆమె మృతదేహాన్ని ఓల్డ్ ఆల్వాల్‌కు తరలించారు.
మేడ్చల్ మండలంలోని మునిరాబాద్‌లో తన సోదరి సకలమ్మ నివాసానికి మాజీ సీఎం కేసీఆర్ చేరుకొని నివాళులు అర్పించారు. అలాగే కేటీఆర్, హరీశ్ రావు, కవిత, మల్లారెడ్డి, శంబీపూర్ రాజు నివాళులు అర్పించారు. ఇవాళ జరిగిన సకలమ్మ అంత్యక్రియల కార్యక్రమంలో మాజీ సీఎం కేసీఆర్, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.