లాక్డౌన్ నిబంధనలకు ప్రజలు కట్టుబడి ఉన్నా.. కొంతమంది వక్రబుద్ధి చూపిస్తున్నారు. అలాంటి ఓ వ్యక్తిపై కేసు పెట్టారు తమిళనాడు పోలీసులు. 'కరోనా విందు' పేరిట వేడుక నిర్వహించినందుకు అరెస్టు చేశారు.
ఫేస్బుక్ పోస్టుతో...
తంజావూరు జిల్లా కబిస్థలం గ్రామానికి చెందిన 29 ఏళ్ల శివగురు... తిరుప్పూర్లో పనిచేసేవాడు. 2 నెలల క్రితమే స్వస్థలానికి వచ్చాడు. లాక్డౌన్ నేపథ్యంలో స్నేహితులందరూ ఊరిలోనే ఉండటం వల్ల సరదాగా గ్రామ శివారులో 'కరోనా విందు' పేరుతో గెట్ టుగెదర్ ఏర్పాటు చేశారు. రకరకాల వంటలు చేయించి అందరూ కలసి భోజనం చేశారు. అంతటితో ఆగకుండా ఫేస్బుక్లో ఫోస్ట్ చేశాడు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. గ్రామ పరిపాలనాధికారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, శివగురును అరెస్ట్ చేశారు.
ఇదీ చూడండి: లాక్డౌన్ వేళ వైభవంగా మాజీ సీఎం కుమారుడి వివాహం!