ETV Bharat / bharat

'మెరుగుపడిన కరోనా కేసుల రెట్టింపు సమయం' - corona latest updates

కరోనా వల్ల విదేశాల్లో చిక్కుకున్న వలసదారులు, ప్రవాస భారతీయులు తిరిగి దేశానికి చేరుకుంటున్న క్రమంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ.. రాష్ట్రాలకు పలు సూచనలు జారీ చేసింది. దేశంలోకి వస్తున్నవారిపై నిఘా వ్యవస్థ, కాంటాక్ట్​ ట్రేసింగ్​, సకాలంలో చికిత్స అందించడంపై దృష్టి సారించాలని మంత్రి హర్షవర్ధన్​ కోరారు. కరోనా కేసుల రెట్టింపు సమయం ప్రస్తుతం 10.9 రోజుల నుంచి 12.2 రోజులకు మెరుగుపడిందని తెలిపారు.

Doubling time of COVID-19 cases now 12.2 days: Harsh Vardhan
'మెరుగుపడిన కరోనా కేసుల రెట్టింపు సమయం'
author img

By

Published : May 12, 2020, 10:44 PM IST

కరోనా కేసుల రెట్టింపు సమయం ప్రస్తుతం 10.9 రోజుల నుంచి 12.2 రోజులకు మెరుగుపడిందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్​ మంగళవారం తెలిపారు. విదేశాల్లో ఉన్న వలసదారులు, ప్రవాస భారతీయుల తిరిగి స్వదేశానికి తిరిగి రానున్న దృష్ట్యా మెరుగైన నిఘా వ్యవస్థ, కాంటాక్ట్​​ ట్రేసింగ్​ అవసరాన్ని గుర్తు చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

'ఆరోగ్య సేతు తప్పని సరి చేయండి..'

దేశంలో ప్రస్తుతం మరణాల రేటు 3.2 శాతం ఉండగా.. వైరస్​ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. రికవరీ రేటు 31.74శాతంగా ఉందని హర్షవర్ధన్​ పేర్కొన్నారు.

జమ్ముకశ్మీర్​, లద్దాఖ్​, ఉత్తరాఖండ్​, హిమాచల్​ప్రదేశ్​ రాష్ట్రాల్లో కరోనా నియంత్రణకు చేపడుతున్న చర్యలను కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి అశ్వనీ కుమార్‌ చౌబేతో కలిసి సమీక్షించారు హర్షవర్ధన్​. విదేశాల నుంచి తిరిగి వచ్చిన వారందరిపై నిఘా పెట్టి, పరీక్షలు నిర్వహించడం, కాంటాక్ట్​ ట్రేసింగ్​, సకాలంలో చికిత్స అందించడంపై దృష్టి కేంద్రీకరించాలని రాష్ట్రాలను కోరారు. అందరికీ ఆరోగ్య సేతు మొబైల్​ యాప్​​ను తప్పనిసరి చేయాలని సూచించారు.

ఇతర విషయాలు..

  • ఇప్పటివరకు నమోదైన యాక్టివ్​ కేసుల్లో ఐసీయూలో ఉంటున్న రోగులు 2.37 శాతం.
  • వెంటిలేటర్లపై 0.41శాతం మంది ఉండగా.. ఆక్సిజన్​ సాయంతో చికిత్స తీసుకుంటున్న వారు 1.82 శాతం.
  • 347 ప్రభుత్వ ప్రయోగశాలలు, 137 ప్రైవేటు ల్యాబ్​లతో కరోనా పరీక్షలు.. రోజులో లక్ష వరకు చేసే సామర్ధ్యం పెరిగింది.
  • కరోనా నిర్ధరణ కోసం ఇప్పటి వరకు 17,62,840 పరీక్షలు జరిగాయి.
  • ఒక్క సోమవారమే 86,191 నమూనాలను పరీక్షించారు.

'ప్రారంభ దశలోనే వైరస్​ను గుర్తించొచ్చు..'

వైరస్​పై పోరాటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమర్థవంతంగా చేస్తున్న కృషిని చూస్తుంటే.. ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనేందుకు దేశం సిద్ధంగా ఉందనే భరోసా లభించిందని హర్షవర్ధన్​ ధీమా వ్యక్తం చేశారు.

ఉత్తరాఖండ్​లో శ్వాసకోస సంబంధిత సమస్యలు, ఫ్లూ లక్షణాలపై నిఘా వ్యవస్థ, కాంటాక్ట్​ ట్రేసింగ్​ కోసం చేసిన కృషిని హర్షవర్ధన్​ ప్రశంసించారు. ఈ విధంగా చేయడం వల్ల ప్రారంభ దశలోనే వైరస్​ సోకిన వ్యక్తిని గుర్తించి.. మహమ్మారిని అరికట్టవచ్చని అన్నారు. లద్దాఖ్​లో పొగాకు వినియోగం అధికంగా ఉన్న నేపథ్యంలో.. ప్రభుత్వం విధించిన నిబంధనల మేరకు బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయకూడదని సూచించారు.

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 2,293 మంది వైరస్​కు బలైనట్లు ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. 70వేలకు పైగా మహమ్మారి బారిన పడ్డారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.