ETV Bharat / bharat

ఆపరేషన్ ఎయిర్​లిఫ్ట్​​​, సముద్ర సేతు మార్గదర్శకాలు - movement of stranded indians in abroad

విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలించేందుకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్​ను విడుదల చేసింది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ. ప్రయాణ ఖర్చులు వారే భరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. వైద్య పరీక్షలు క్వారంటైన్​కు సంబంధించిన ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వాలే చూసుకోవాలని తెలిపింది.

deporting of indians of abroad
ఆపరేషన్ ఎయిర్​లిఫ్ట్
author img

By

Published : May 5, 2020, 9:34 PM IST

Updated : May 6, 2020, 8:39 PM IST

కరోనా నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకుని ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేలాది మందిని భారత్​కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది కేంద్రం. విమానాలు, ఓడల ద్వారా వీరిని స్వదేశం చేర్చనుంది. వీటికి సంబంధించిన స్టాండర్డ్​ ఆపరేటింగ్ ప్రోటోకాల్​ను కేంద్ర హోమంత్రిత్వ శాఖ విడుదల చేసింది.

deporting-of-indians-of-abroad
స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్

నిబంధనలివే..

  • ఎవరి ప్రయాణ ఖర్చులు వారే భరించాలి.
  • వీసా గడువు ముగిసిన వారు, ఆరోగ్య అత్యవసర పరిస్థితి ఉన్నవారు, జీవానోపాధి కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న కార్మికులకే తొలి ప్రాధాన్యం ఉంటుంది.
  • బోర్డింగ్​కు ముందు అందరికీ థర్మల్ స్క్రీనింగ్ నిర్వహిస్తారు. వైరస్ లక్షణాలు లేకుంటేనే అనుమతి ఉంటుంది.
  • ప్రయాణికులందరూ తప్పనిసరిగా ఆరోగ్య సేతు యాప్ డౌన్​లోడ్​ చేసుకోవాలి.
  • మాస్క్​లు, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి.
  • స్వదేశం చేరుకున్నాక సొంత ప్రాంతాలకు చేరుకునే ఏర్పాట్లు ఆయా రాష్ట్రాలే చూసుకోవాలి.
  • ప్రయాణికులకు వైద్య పరీక్షలు, క్వారంటైన్​ కేంద్రాల ఏర్పాటు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే.
  • స్వదేశం వచ్చాక తప్పనిసరిగా 14 రోజులు క్వారంటైన్​ కేంద్రంలో ఉండాలి.
  • ఆ తర్వాత వైద్య పరీక్షల్లో నెగిటివ్ వస్తేనే ఇళ్లకు పంపాలి. కొద్దిరోజులు స్వీయ నిర్భందంలో ఉండాలి.

ఆపరేషన్ సముద్ర సేతు..

సముద్ర మార్గం ద్వారా విదేశీయులను స్వదేశం తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది భారత నావికాదళం. ఆపరేషన్ 'సముద్ర సేతు' కోసం జలశ్వా, మగర్ ఓడలను మాల్దీవుల నౌకాశ్రయానికి బయలు దేరాయి. ఫేస్​-1లో భాగంగా మే 8 నుంచి తరలింపు కార్యక్రమం చేపట్టనుంది.

ఇదీ చదవండి: ఎయిర్​లిఫ్ట్​: 7 రోజులు.. 64 విమానాలు.. 14,800 మంది!

Last Updated : May 6, 2020, 8:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.