ETV Bharat / international

ఎయిర్​లిఫ్ట్​: 7 రోజులు.. 64 విమానాలు.. 14,800 మంది!

author img

By

Published : May 5, 2020, 3:50 PM IST

విదేశాల్లో చిక్కుకున్న భారతీయుల్ని తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. మే 7 నుంచి 13 వరకు దాదాపు 64 విమానాలను నడపాలని యోచిస్తోంది.

7 రోజులు.. 64విమానాలు..14,800మంది!
7 రోజులు.. 64విమానాలు..14,800మంది!

కరోనా విజృంభణ కొనసాగుతున్న వేళ.. విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను వెనక్కి రప్పించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది. మొదటి వారంలో 64 ప్రత్యేక విమానాల ద్వారా వేలాది మంది భారతీయులను తరలించనున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మే 7 నుంచి 13 వరకు మొత్తం 12 దేశాల్లోని దాదాపు 14,800 మంది భారతీయుల్ని వెనక్కి తీసుకురానున్నట్టు ప్రభుత్వ సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు.

భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు ఎయిర్​ ఇండియా, దాని అనుబంధ ఎయిర్​ ఇండియా ఎక్స్‌ప్రెస్‌.. ప్రత్యేక విమానాలను నడపనున్నాయన్నారు.

ఆ 12 దేశాలివే..

యూఏఈ, యూకే, అమెరికా, ఖతార్‌, సౌదీ అరేబియా, సింగపూర్‌, మలేసియా, ఫిలిప్పీన్స్‌, బంగ్లాదేశ్‌, బహ్రెయిన్‌, కువైట్‌, ఒమన్.

ఎక్కడి నుంచి ఎన్నెన్ని విమానాలు?

యూఏఈ నుంచి 10, అమెరికా, యూకే నుంచి చెరో ఏడు చొప్పున విమానాలను నడపనుంది కేంద్రం. సౌదీ అరేబియా, సింగపూర్​ నుంచి చెరో 5, ఖతార్‌ నుంచి రెండు విమానాలు నడపనుందని ఓ అధికారి వెల్లడించారు. వీటితో పాటు మలేసియా, బంగ్లాదేశ్‌ నుంచి చెరో 7, కువైట్‌, ఫిలిప్పీన్స్‌ నుంచి చెరో 5 చొప్పున, ఒమన్‌, బహ్రెయిన్‌ నుంచి రెండేసి చొప్పున విమానాలు నడిపే అవకాశం ఉంది.

మొత్తం 64 విమానాల్లో కేరళ నుంచి 15, దిల్లీ, తమిళనాడు నుంచి చెరో 11, మహారాష్ట్ర, తెలంగాణ నుంచి చెరో 7, మిగతా రాష్ట్రాల నుంచి 5 చొప్పున విమానాలు నడుస్తాయని ఆయన వివరించారు. ఈ వారం రోజుల్లో 14,800 మంది భారతీయులు చేరుకుంటారని.. మిగతా వారిని తీసుకొచ్చేందుకు మే 13 తర్వాత కేంద్రం మరిన్ని విమానాలను నడుపుతుందని మరో అధికారి తెలిపారు.

ఎవరి ఖర్చులు వారివే..

కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడమే లక్ష్యంగా దేశంలో మార్చి 25న ప్రారంభమైన లాక్‌డౌన్‌ ఈ నెల 17 వరకు కొనసాగనుంది. ఈ నేపథ్యంలోనే ప్రయాణ విమానాల రాకపోకలను రద్దు చేసింది కేంద్రం. దీంతో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను విమానాలు, నౌకాదళ ఓడల్లో తరలించేందుకు ప్రామాణిక నిర్వహణ విధానం (స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొటోకాల్‌-ఎస్‌వోపీ) సిద్ధం చేసినట్లు కేంద్ర హోంశాఖ సోమవారం తెలిపింది. ఎవరి ఖర్చులు వారే భరించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

భారతీయులు స్వదేశంలో అడుగుపెట్టిన తర్వాత వారికి అవసరమైన పరీక్షలు, క్వారంటైన్‌ సౌకర్యాలు రాష్ట్రాలే ఏర్పాటుచేయాలని, ఖర్చులను ఆయా ప్రభుత్వాలే భరించాలని ఇప్పటికే తెలిపింది కేంద్రం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.