మోదీ ప్రభుత్వం 500,1000 నోట్లను రద్దు చేసి సరిగ్గా నేటితో మూడు సంవత్సరాలు అవుతోంది. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు దిల్లీలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయం వద్ద నిరసనలు చేపట్టారు. ప్లకార్డులు, కాంగ్రెస్ జెండాలను పట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజలకు ప్రధాని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
"ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వల్ల ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. నోట్ల రద్దు చేసి మూడేళ్లు అవుతున్నా.. ఇప్పటికీ ఆర్థిక వ్యవస్థ కుదుటపడలేదు"
-బీవీ శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు.
2016 నవంబర్ 8న ప్రధాని నరేంద్ర మోదీ.. 1000, 500 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఇదీ చూడండి:'కాషాయం'పై క్లారిటీ ఇచ్చిన సూపర్‌స్టార్