దేశ రాజధాని దిల్లీలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉన్నట్లు నిఘావర్గాలు హెచ్చరించాయి. దాడులు చేసే ఉద్దేశంతో నాలుగు నుంచి ఐదుగురు తీవ్రవాదులు నగరంలోకి ప్రవేశించినట్లు సమాచారం అందించాయి. ఈ నేపథ్యంలో దిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు.
ఉగ్రదాడులపై సమాచారంతో దిల్లీలోని 15 పోలీసు జిల్లా కేంద్రాల విభాగాలు సహా క్రైమ్ బ్రాంచ్, ప్రత్యేక పోలీసు విభాగాలకు హైఅలర్ట్ ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. దిల్లీ సరిహద్దులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రద్దీ ఎక్కువగా ఉండే మార్కెట్లు, ఆస్పత్రి ప్రాంతాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
భారత్-చైనా మధ్య నెలకొన్న ప్రతిష్టంభనతో ఇప్పటికే నిఘా పెంచాయి భద్రతా దళాలు.
ఇదీ చూడండి: భారత్- చైనా సరిహద్దు సమస్యకు అసలు కారణమేంటి?