ETV Bharat / bharat

క్వారంటైన్ నుంచి 4వేల మంది తబ్లీగీలు విడుదల! - క్వారంటైన్ నుంచి 4వేల మంది తబ్లీగీల విడుదల!

క్వారంటైన్ సమయం పూర్తి చేసుకున్న 4వేల మంది తబ్లీగీ జమాత్ సభ్యులను విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది దిల్లీ ప్రభుత్వం. అయితే.. అందులో మర్కజ్ ఘటన కేసుకు సంబంధించి దర్యాప్తు ఎదుర్కోవాల్సిన వారిని పోలీసు కస్టడీకి తరలించాలని పేర్కొంది. మిగతా వారిని వారి సొంత రాష్ట్రాలకు పంపేందుకు చర్యలు చేపట్టాలని తెలిపింది.

Tablighi members
క్వారంటైన్ నుంచి 4వేల మంది తబ్లీగీల విడుదల!
author img

By

Published : May 6, 2020, 7:53 PM IST

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో క్వారంటైన్​ కేంద్రాల్లో ఉన్న 4 వేల మంది తబ్లీగీ జమాత్ సభ్యులను విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది దిల్లీ ప్రభుత్వం. క్వారంటైన్ సమయం పూర్తయిన క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. అందులో మర్కజ్​ ఘటన కేసుకు సంబంధించి దర్యాప్తు ఎదుర్కోవాల్సిన వారిని దిల్లీ పోలీసుల కస్టడీకి తరలించాలని తెలిపింది.

ఈ మేరకు దిల్లీ హోంశాఖ మంత్రి సత్యేందర్ జైన్ ఆదేశాలు జారీ చేశారు.

"మర్కజ్ ఘటన కేసుకు సంబంధం ఉన్న, దర్యాప్తు ఎదుర్కోవాల్సిన తబ్లీగీ సభ్యులను దిల్లీ పోలీసుల కస్టడీకి తరలించాలి. ఇతరులను వారి వారి స్వరాష్ట్రాలకు తరలించాల్సిన అవసరం ఉంది. దీనికోసం దిల్లీ హోంశాఖ ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుతోంది. 900 మంది దిల్లీకి చెందిన వారు కాగా మిగతా వారు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. అందులో అత్యధికంగా తమిళనాడు, తెలంగాణ నుంచే వచ్చారు."

– సత్యేందర్ జైన్, దిల్లీ హోంమంత్రి.

దిల్లీ నిజాముద్దీన్​లోని మర్కజ్ ప్రాంతంలో నిర్వహించిన మతపరమైన సమావేశానికి హాజరైన వేల మంది తబ్లీగీ సభ్యులను క్వారంటైన్​కు తరలించింది దిల్లీ ప్రభుత్వం. అందులో చాలా మందికి కరోనా పాజిటివ్​గా రావడం వల్ల మర్కజ్ ప్రాంతాన్ని ప్రధాన హాట్​స్పాట్​లుగా గుర్తించింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.