ETV Bharat / bharat

'దిల్లీ అల్లర్ల మృతుల సంఖ్య 53 కాదు 44 మాత్రమే' - delhi latest news

దిల్లీ అల్లర్లలో మృతుల సంఖ్య 44 మాత్రమేనని అధికారులు మరోమారు స్పష్టం చేశారు. అయితే మరో మూడు ఆసుపత్రుల్లో 9 మృతదేహాలు ఉన్నాయి. వీటితో అల్లర్లకు సంబంధం ఉందా లేదా అనే అంశంపై స్పష్టత లేదని తెలిపారు.

delhi-death-toll-raised-to-53
'దిల్లీ అల్లర్ల మృతుల సంఖ్య 53 కాదు 44 మాత్రమే'
author img

By

Published : Mar 5, 2020, 8:42 PM IST

Updated : Mar 5, 2020, 9:50 PM IST

ఈశాన్య దిల్లీ అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్యపై అస్పష్టత నెలకొంది. అల్లర్లలో 53 మంది మరణించినట్టు తెలుస్తుండగా.. అధికారులు మాత్రం మృతుల సంఖ్య 44 మాత్రమేనని చెబుతున్నారు.

లోక్​ నాయక్​ జై ప్రకాశ్​ నారాయణ్​ ఆసుపత్రిలో 3, రామ్​ మనోహర్​ లోహియా ఆసుపత్రిలో 5, జగ్​ ప్రవేశ్​ చంద్రా ఆసుపత్రిలో 1 మృతదేహాముంది. వీరందరూ ఆల్లర్లలోనే మరణించారా లేదా అనే విషయంపై స్పష్టత లేదు.

కేసులు...

అల్లర్లకు సంబంధించి ఇప్పటివరకు 654 కేసులు నమోదయ్యాయని దిల్లీ పోలీసులు వెల్లడించారు. ఇందులో 47కేసులు ఆయుధ చట్టానికి సంబంధించినవని పేర్కొన్నారు. మొత్తం 1820 మందిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.

పరిహారం...

దిల్లీ అల్లర్ల ప్రభావిత ప్రాంతాల్లో చాలా నివాసాల్లో వస్తువులు చోరికి గురవ్వడం, ధ్వంసమవడం జరిగింది. ఇళ్లలో అన్ని వస్తువులు చోరికి గురైన బాధితులకు రూ.లక్ష, పాక్షికంగా చోరీకి గురైన బాధితులకు రూ.50వేలు పరిహారం ఇవ్వాలని దిల్లీ కేబినెట్​ నిర్ణయించింది.

అల్లర్లులో ధ్వంసమైన పాఠశాలల యజమానులకు రూ.10లక్షల వరకూ పరిహారం ఇవ్వనుంది దిల్లీ ప్రభుత్వం.

ఈశాన్య దిల్లీ అల్లర్లలో ఇళ్లు ధ్వంసమైన వారికి రూ. 5లక్షల పరిహారం గతంలోనే ప్రకటించింది కేజ్రీవాల్ ప్రభుత్వం. ఇంటి యజానికి రూ. 4లక్షలు, అద్దెకు ఉండే వారికి రూ.లక్ష చొప్పున ఇస్తామని చెప్పింది. ఇప్పుడు వస్తువులకు కూడా పరిహారాన్ని చెల్లించనుంది.

Last Updated : Mar 5, 2020, 9:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.