అగస్టా వెస్ట్‌లాండ్ మనీ లాండరింగ్ కేసులో అప్రూవర్‌గా మారతానన్న వాంగ్మూలాన్ని మెజిస్ట్రేట్ ముందు మార్చి 5న రికార్డు చేయాలని రాజీవ్ సక్సేనాకు దిల్లీకోర్టు ఆదేశించింది.
మార్చి 2నే వాంగ్మూలాన్ని సక్సేనా సమర్పించాల్సింది. ఆరోగ్యం సరిగా లేనందున మార్చి5కు మార్చాలనే వినతికి న్యాయస్థానం అంగీకరించింది.
రూ.3వేల600 కోట్ల అగస్టా వెస్ట్‌లాండ్ మనీ లాండరింగ్ కేసు నిందితుల్లో రాజీవ్ సక్సేనా ఒకరు.
ఈ కేసులో అప్రూవర్‌గా మారి తనకు తెలిసిన సమాచారమంతా వెల్లడించి విచారణకు పూర్తిగా సహకరిస్తానని గతవారం కోర్టును అభ్యర్థించారు సక్సేనా.