ETV Bharat / bharat

పీసీసీ అధ్యక్షులతో సోనియా గాంధీ కీలక భేటీ - కాంగ్రెస్ వార్తలు

దిల్లీలో కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం నిర్వహించింది. వివిధ రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, శాసనసభాపక్షనేతలతో ఏఐసీసీ సమావేశం జరిగింది. సమావేశంలో దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంపైనే ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం.. సోనియా గాంధీ అధ్యక్షతన పార్లమెంటరీ వ్యూహాత్మక బృందం భేటీ కానుంది.

పీసీసీ అధ్యక్షులతో సోనియా గాంధీ కీలక సమావేశం
author img

By

Published : Nov 16, 2019, 3:01 PM IST

దిల్లీలో కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం జరిగింది. పార్టీ సీనియర్ నేతలతో పాటు వివిధ రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, శాసనసభాపక్షనేతలతో ఏఐసీసీ సమావేశం జరిగింది. ప్రస్తుతం దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు సహా ఇతర ప్రధాన అంశాలపై సోనియా చర్చించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితులలో పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలతో పాటు పార్టీ బలోపేతానికి కృషి చేసేలా నేతలకు సోనియా దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.

సమావేశంలో ప్రధానంగా దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంపైనే దృష్టి సారించినట్లు ఉత్తరా​ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత హరీష్ రావత్ తెలిపారు.

'ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి అత్యంత ఆందోళనకరస్థితిలో ఉంది. దేశానికే కాదు ఇది ప్రతి ఒక్కరికీ ఆందోళన కలిగించే విషయం'

-హరీష్ రావత్, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత

కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. దేశ ఆర్థికవృద్ధి మందగమనానికి నిరసనగా నవంబర్ 30న దిల్లీలోని రాంలీలా మైదానం నుంచి ర్యాలీ చేపట్టనున్నట్లు హస్తం పార్టీ ప్రకటించింది.

పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన ఆమె నివాసంలో పార్లమెంటరీ వ్యూహాత్మక బృందం ఇవాళ సాయంత్రం భేటీ కానుంది. తదుపరి వ్యూహాలపై చర్చించనుంది.

New Delhi, Nov 16 (ANI): Vice President Venkaiah Naidu released the book 'Savarkar- Echoes from a Forgotten Past' written by Dr Vikram Sampath in the national capital. While speaking about Veer Savarkar's personality, the Vice President said, "Very few in India know that Veer Savarkar started one of the most powerful social reform movements against untouchability in India. He built 'Patit Pavan Mandir' in the Ratnagiri district to allow entry to all Hindus, including dalits."
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.