ఆర్ఎస్ఎస్ కార్యకర్త దాఖలు చేసిన పరువునష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి బెయిల్ లభించింది. రూ.15 వేల పూచీకత్తుపై ఆయనను ముంబయి న్యాయస్థానం విడుదల చేసింది. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కూడా విచారణకు హాజరయ్యారు.
కర్ణాటకకు చెందిన పాత్రికేయురాలు గౌరీ లంకేశ్ 2017 సెప్టెంబర్‌లో బెంగళూరులో హత్యకు గురయ్యారు. ఈ హత్య వ్యవహారంలో రాహుల్ గాంధీ భాజపా-ఆర్ఎస్ఎస్పై తీవ్ర విమర్శలు చేశారు.
ఈ ఆరోపణలను తప్పుపడుతూ సంఘ్ కార్యకర్త, న్యాయవాది ధ్రుతిమన్ జోషి 2017లో కోర్టును ఆశ్రయించారు. రాహుల్‌తో పాటు అప్పటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, సీపీఎం నేత సీతారాం ఏచూరిపైనా పరువు నష్టం కేసు వేశారు.
జోషి ఫిర్యాదుతో రాహుల్, సీతారాం ఏచూరికి కోర్టు ఈ ఏడాది ఫిబ్రవరిలో సమన్లు జారీచేసింది. నేడు విచారణకు హాజరయ్యారు రాహుల్, సీతారాం ఏచూరి.
ఇదీ చూడండి: ఎట్టకేలకు గాడినపడ్డ వాట్సాప్, ఇన్‌స్టా