ETV Bharat / bharat

అప్పులు భారంతో గుండె, కిడ్నీ అమ్మకానికి పెట్టిన తల్లి! - Kerala Health Minister K K Shailaja

పిల్లల ఆస్పత్రుల ఖర్చుల కోసం చేసిన అప్పులు తీర్చలేక.. బతుకు భారమైన ఓ మహిళ తన అవయవాల అమ్మకానికి సిద్ధమైంది. రోడ్డు పక్కన 'ఆర్గాన్స్​ ఫర్​ సేల్​' అని బోర్డు పెట్టి మరీ.. వచ్చీపోయేవాళ్లతో తన గోడు వెళ్లబోసుకుంది. కేరళ ఎర్నాకుళం జిల్లాకు చెందిన ఓ మహిళ దుస్థితి తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటామని హామీ ఇచ్చింది.

Debits running into lakhs sick children Mother of 5 stands on the road with organ for sale board
అప్పులు తీర్చలేక కిడ్నీ అమ్మకానికి సిద్ధమైన తల్లి!
author img

By

Published : Sep 22, 2020, 3:55 PM IST

కేరళ ఎర్నాకుళంలోని వరపూజ ప్రాంతానికి చెందిన శాంతికి ఐదుగురు పిల్లలు. పుట్టినప్పటి నుంచి అనారోగ్య సమస్యలతో ఉన్న పిల్లల ఆస్పత్రుల ఖర్చుల కోసం లక్షలకు లక్షలు అప్పు చేసింది. ఉన్న ఇంటినీ అమ్ముకుంది. అయినా ఫలితం లేదు. వాళ్ల సమస్యలు తీరలేదు. డబ్బుల్లేక అద్దె ఇంటినీ వీడాల్సి వచ్చింది. రోడ్డు పక్కనే జీవనం సాగించాల్సిన పరిస్థితి వచ్చింది.

కొచ్చి కంటైనర్​ రోడ్డు పక్కన చిన్న గుడిసె వేసుకొని అందులోనే కుటుంబంతో ఉంటోంది శాంతి. ఇటీవలే ముగ్గురు పిల్లలకు శస్త్రచికిత్సలు జరిగాయి. కానీ మందులకు డబ్బుల్లేవు. ఆమెకు ఇప్పటికే రూ. 20 లక్షలకుపైగా అప్పు ఉంది. చేసేదేమీ లేక తన గుండె, కిడ్నీలను అమ్మేందుకు సిద్ధపడింది. రోడ్డు పక్కనే 'ఆర్గాన్స్​ ఫర్​ సేల్​' అని బోర్డు పెట్టి.. తన అవయవాలు తీసుకొని డబ్బులు ఇవ్వాలని వేడుకుంది.

Debits running into lakhs sick children Mother of 5 stands on the road with organ for sale board
ఆర్గాన్స్​ ఫర్​ సేల్​ అని బోర్డు పెట్టిన మహిళ

ప్రభుత్వం హామీ..

శాంతి పరిస్థితిని గమనించిన పోలీసులు.. ఆమెను అక్కడి నుంచి పోలీస్​స్టేషన్​కు తీసుకెళ్లి జిల్లా యంత్రాంగానికి సమాచారమిచ్చారు. అనంతరం.. రెవెన్యూ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు వచ్చి ఆమెతో మాట్లాడారు. అవయవాలు అమ్మాల్సిన అవసరం లేదని.. శాంతికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

కేరళ ఆరోగ్య మంత్రి కేకే శైలజ ఫోన్​ చేసి.. శాంతి పిల్లలకు ప్రభుత్వమే వైద్యం చేయిస్తుందని స్పష్టం చేశారు. ఎర్నాకుళం రోటరీ క్లబ్​.. ఆమె అద్దెను చెల్లిస్తామని తెలిపింది. అనంతరం.. శాంతి దుస్థితి తెలుసుకొని సాయం చేసేందుకు ఎందరో దాతలు ముందుకొచ్చారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలూ.. శాంతి కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసానిచ్చాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.