పంజాబ్ జలంధర్‌లోని లంబా గ్రామంలో చిరుత హడలెత్తించింది. అడవి నుంచి దారితప్పిన చిరుతను చూసి స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఇళ్లకు తాళాలు వేసి భవనాల మీదకు చేరుకున్నారు. ప్రజలందరూ గుంపుగా చేరి గట్టిగా కేకలు వేశారు. ఆ సమయంలో దిక్కుతోచని చిరుత వీధుల్లో పరుగెడుతూ కంటపడిన వారిపై పంజా విసిరింది.
చిరుత దాడిలో నలుగురు స్థానికులు గాయపడ్డారు. గ్రామస్థుల సమాచారంతో అక్కడికి చేరిన అటవీ అధికారులు పులిని పట్టుకునేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. అధికారులపైనా దాడికి యత్నించింది చిరుత. నాలుగు గంటల పాటు ఆపసోపాలు పడ్డ అధికారులు చివరకు చిరుతను బంధించగా ఊపిరి పీల్చుకున్నారు ప్రజలు.