ETV Bharat / bharat

కరోనా ఎఫెక్ట్​: పంద్రాగస్టు వేడుకల్లో భారీ మార్పులు

ఈ ఏడాది.. ఎర్రకోట వేదికగా జరగనున్న స్వతంత్ర వేడుకల్లో భారీ మార్పులు జరగనున్నట్టు తెలుస్తోంది. కరోనా విజృంభణ నేపథ్యంలో చిన్నారులకు అనుమతి ఉండదని సమాచారం. వీవీఐపీలు, ఇతర ఔత్సాహికుల్లో కేవలం 20శాతం మందికే అనుమతినిచ్చే అవకాశముంది. అయితే ఈ వేడుకలకు.. కరోనాను జయించిన 1,500మందిని ప్రత్యేకంగా ఆహ్వానించే యోచనలో ఉంది ప్రభుత్వం. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు ఇప్పటికే మొదలైపోయాయి.

author img

By

Published : Jul 14, 2020, 6:11 PM IST

Curtailed Independence Day celebrations planned due to COVID, no school children to take part
కరోనా ఎఫెక్ట్​: పంద్రాగస్టు వేడుకల్లో భారీ మార్పులు

దేశంలో కరోనా వైరస్​ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈసారి స్వతంత్ర వేడుకలు ఏ విధంగా ఉంటాయనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కరోనాను దృష్టిలో పెట్టుకుని అధికారులు ఇప్పటికే ప్రణాళికలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది దేశ రాజధాని దిల్లీలోని ఎర్రకోట వేడుకల్లో భారీ మార్పులు జరగనున్నట్టు సమాచారం.

మార్పులు ఇలా!

  • వీవీఐపీలు, ఇతర ఔత్సాహికుల్లో కేవలం 20మందికే అనుమతి.
  • చిన్నారులకు, ఎన్​సీసీ సభ్యులకు అనుమతి లేదు.
  • ప్రధాని ప్రసంగించే వేదిక సమీపంలో వీవీఐపీలు కూర్చునేందుకు వీలు లేదు. కొంచెం దిగువన కూర్చోవాలి. అది కూడా ఒకప్పటిలా 900మంది కాకుండా.. 100మందికి మాత్రమే అనుమతి.

వీటితో పాటు కరోనాను జయించిన 1500మందిని ఈ వేడుకలకు ఆహ్వానించనున్నట్టు సమాచారం. ఇందులో 1,000మంది దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు కాగా.. 500మంది స్థానిక పోలీసులు ఉండే అవకాశముంది.

స్వాతంత్ర్య దినోత్సవానికి మరో నెలరోజుల సమయమే ఉన్నందున.. ఏర్పాట్లు మొదలుపెట్టారు. రక్షణశాఖ కార్యదర్శి అజయ్​ కుమార్​ సహా ఇతర అధికారులు గత వారం ఎర్రకోటను సందర్శించారు. భౌతిక దూరాన్ని పాటిస్తూనే ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.

ప్రధాని ప్రసంగాన్ని వినేందుకు.. గతేడాది వరకు దాదాపు 10వేల మంది ఎర్రకోటకు తరలివెళ్లేవారు.

ఇదీ చూడండి:- కరోనా టాప్​​గేర్​తో ఆ రాష్ట్రాల్లో మళ్లీ లాక్​డౌన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.